అమ్మోరు అవ‌తారం ఎత్తిన లేడీ సూప‌ర్ స్టార్

అమ్మోరు అవ‌తారం ఎత్తిన లేడీ సూప‌ర్ స్టార్

80లు, 90ల్లో స్టార్ హీరోయిన్లంద‌రూ త‌మ కెరీర్ చ‌ర‌మాంకంలో అమ్మ‌వార్ల పాత్ర‌ల్లో క‌నిపించేవాళ్లు. భానుప్రియ‌, ర‌మ్య‌కృష్ణ, రోజా,  స‌హా చాలామంది హీరోయిన్లు ఈ త‌ర‌హా పాత్ర‌లు ట్రై చేసిన వాళ్లే. ఐతే ఒక ద‌శ దాటాక ఈ త‌ర‌హా భ‌క్తి సినిమాల‌కు కాలం చెల్లిపోవ‌డంతో అలాంటి పాత్ర‌లు చేయాల్సిన అవ‌స‌రం హీరోయిన్ల‌కు లేక‌పోయింది.

గ‌త కొన్నేళ్ల‌లో అయితే ఆ జాన‌ర్ పూర్తిగా క‌నుమ‌రుగైపోయింది. ఐతే చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ త‌మిళంలో ఓ అమ్మ‌వారి సినిమా వ‌స్తుండ‌టం విశేషం. అందులో అమ్మ‌వారి పాత్ర చేస్తున్న‌ది ఔట్ డేటెడ్ హీరోయిన్ కాదు. లేటు వ‌య‌సులోనూ భారీ చిత్రాల‌తో బిజీ బిజీగా ఉన్న లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌.

న‌య‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న కొత్త చిత్రం మూకుతి అమ్మ‌న్. ఈ సినిమా క‌థేంటో కానీ.. ఇది కూడా ఒక‌ప్ప‌టి త‌ర‌హా అమ్మ‌వారు-భ‌క్తురాలు టైపు సినిమానేనా అన్న‌ది తెలియ‌దు కానీ.. న‌య‌న్ మాత్రం అమ్మోరు పాత్ర‌లో భ‌లేగా సెట్ట‌యింది. ఆమె లుక్ గ‌త కొన్ని సినిమాల‌తో పోలిస్తే ఇందులో చాలా బాగుంది. గెట‌ప్, మేక‌ప్ ప‌ర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.

రేడియో జాకీగా ప‌రిచ‌య‌మై త‌ర్వాత సినిమాల‌తోనూ స‌త్తా చాటిన ఆర్జే బాలాజి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర చేయ‌డంతో పాటు ఎన్జే శ‌ర‌వ‌ణ‌న్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌డం విశేషం. చాలా ట్రెండీగా క‌నిపించే బాలాజి స్టీరియో టైపు అమ్మ‌వారి సినిమా అయితే చేసి ఉండ‌డ‌ని.. న‌య‌న్ కూడా అలాంటి సినిమాకైతే ఓకే చెప్పి ఉండ‌ద‌ని భావిస్తున్నారు. మ‌రి ఈ సినిమా వెనుక గుట్టేంటో టీజ‌ర్ వ‌చ్చాక కానీ తెలియ‌దేమో.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English