అల వైకుంఠపురములో డిస్ట్రిబ్యూటర్ సారీ

అల వైకుంఠపురములో డిస్ట్రిబ్యూటర్ సారీ

అల వైకుంఠపురములో రిలీజ్‌కు ముందు ఆ సినిమా పోస్టర్ మీద వేసిన ఓ అప్పీల్ చూసి అందరూ షాకయ్యారు. ఈ సినిమాను మీదు అమేజాన్‌లో కానీ.. నెట్‌ఫ్లిక్స్‌లో కానీ చూడరు అంటూ ఈ చిత్ర యుఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ డిస్క్లైమర్ వేయడం విశేషం. ఈ రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ జోరు వల్ల యుఎస్‌లో తెలుగు సినిమాల వసూళ్లపై గట్టిగా ప్రభావం పడుతుండటం ఆ సంస్థ ఇలా వేసుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఈ సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. యుఎస్ ప్రేక్షకులు విరగబడి చూశారు. నాన్-బాహుబలి హిట్ రికార్డు అందించారు.

ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ చిత్రం డిజిటల్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ముందు సన్ నెక్స్ట్‌లో రిలీజ్ అన్నారు. కానీ దాంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ సినిమాను రిలీజ్ చేసేశారు. దీంతో ఒకప్పటి ‘అల వైకుంఠపురములో’ పోస్టర్లు జనాలకు గుర్తుకొస్తున్నాయి. డిస్ట్రిబ్యూషన్ సంస్థకు చెడ్డ పేరు వస్తోంది.

ఐతే ఈ విషయాన్ని ఇగ్నోర్ చేయకుండా సదరు సంస్థ స్పందించడం విశేషం. తాము ఒకప్పుడు ఇచ్చిన ప్రకటనను గుర్తు చేస్తూ ప్రేక్షకులకు సారీ చెప్పిందా సంస్థ. తాము ఎలా మాట తప్పాల్సి వచ్చిందో ఆ సంస్థ వివరించింది. అసలు విషయం ఏంటంటే.. సన్ నెక్స్ట్ వాళ్లతో డీల్ సంగతి తెలిసే ఈ సంస్థ పోస్టర్ల మీద డిస్క్లైమర్ వేసింది. యుఎస్‌లో సన్ నెక్స్ట్‌కు సబ్ స్క్రైబర్లు బాగా తక్కువ. అక్కడంతా నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్‌లదే హవా.

సన్ వాళ్లకు జియో సినిమాతో డీల్ ఉంది. తమ సినిమాల్ని జియో వాళ్లకు కూడా ఇస్తుంటారు. ‘అల వైకుంఠపురములో’ను డిజిటల్‌లో రిలీజ్ చేసినపుడు సన్, జియో యాప్స్‌లో అందుబాటులోకి వస్తుందని అనుకుంటే.. తమకు యుఎస్‌లో పెద్దగా బేస్ లేని నేపథ్యంలో సన్ వాళ్లు నెట్ ఫ్లిక్స్‌తో డీల్ చేసుకున్నారు. అందులో ‘అల..’ను అందుబాటులోకి తెచ్చారు. ఈ డీల్ ఎప్పుడు జరిగిందో కానీ.. అప్పుడు పోస్టర్ వేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థకు దీని గురించి సమాచారం లేదట. అందుకే తాము మాట తప్పినందుకు సారీ చెబుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందా సంస్థ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English