పాపం పూరి.. జాక్ పాట్ కొట్టాడనుకుంటే

పాపం పూరి.. జాక్ పాట్ కొట్టాడనుకుంటే

పూరి జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడనే వార్త తొలిసారి బయటికి వచ్చినపుడు.. అందరూ విజయ్‌నే హెచ్చరించారు. ఇప్పుడున్న ఫాంలో పూరితో సినిమా అవసరమా అన్నారు. కానీ విజయ్ ఆ సినిమాను ఓకే చేశాడు. అప్పుడందరూ పూరి జాక్ పాట్ కొట్టేశాడంటూ కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు చూస్తే పూరి అనవసరంగా విజయ్‌తో సినిమా చేస్తున్నాడన్న అభిప్రాయాలు ఆయన అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.

విజయ్‌తో సినిమా ఓకే చేసే సమయానికి ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. ఈ మధ్యే విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి పెద్ద డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు ముందే విజయ్ మార్కెట్, ఫాలోయింగ్ కొంత దెబ్బ తిన్నాయి. ఇప్పుడు మరింతగా డౌన్ అయిపోయాడు.

విజయ్ మార్కెట్ డౌన్ అవడమే ఒక సమస్య అనుకుంటే.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తాలూకు మరో బ్యాడ్ ఎఫెక్ట్ పూరి-విజయ్ సినిమాపై పడేలా కనిపిస్తోంది. ఇంతకుముందు విజయ్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ని హోల్ సేల్‌గా కొని రిలీజ్ చేసి భారీగా లాభాలు చేసుకున్న నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మీద భారీగా పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున నష్టాలు చవిచూశాడు. ఆయన తనకు పరిహారం అందించాలని పంపిణీదారుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఆయనకు డిస్ట్రిబ్యూటర్లందరూ మద్దతుగా నిలుస్తున్నారు.

దీనిపై నిర్మాత కె.ఎస్.రామారావు, విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి. బయ్యర్ల ఒత్తిడితో ఆల్రెడీ రామారావు విజయ్‌ను పారితోషకం వెనక్కివ్వాలని అడిగినట్లు చెబుతున్నారు. అతనేమంటున్నాడో తెలియదు. రామారావు, విజయ్ స్పందించని పక్షంలో వీళ్లిద్దరి తర్వాతి సినిమాల్ని బహిష్కరించాలని పంపిణీదారులు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోనున్నారట. ఇదే జరిగితే విజయ్ సినిమాను టేకప్ చేసిన పూరి బుక్కయినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English