మహేష్ గ్రీన్ సిగ్నల్.. జూన్లో షూటింగ్

మహేష్ గ్రీన్ సిగ్నల్.. జూన్లో షూటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా తన రెండో సినిమా విషయంలోనూ పెద్ద ట్విస్టు ఇచ్చాడు. ‘మహర్షి’ తర్వాత సుకుమార్ సినిమా చేయాల్సిన మహేష్.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి అనిల్ రావిపూడి సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాత మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించాల్సింది. కానీ అనూహ్యంగా అది కూడా రద్దయిపోయింది. దీని స్థానంలోకి పరశురామ్ ప్రాజెక్టు వచ్చింది.

ముందు ఈ వార్త జస్ట్ రూమర్ అనుకున్నారు కానీ.. అదేమీ కాదని స్పష్టమైంది. నిజంగానే మహేష్.. పరశురామ్‌తో సినిమా చేయబోతున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పది రోజుల కిందటే పరశురామ్‌కు ఫోన్ చేసి గత ఏడాది చెప్పిన లైన్‌ మీద పూర్తి స్క్రిప్టుతో రమ్మన్నాడు మహేష్. ఆల్రెడీ ఈ స్క్రిప్టు మీద పని చేసిన పరశురామ్.. ఇంకొంత మెరుగులు దిద్ది మళ్లీ మహేష్‌ను కలిశాడన్నది తాజా సమాచారం.

లేటెస్ట్ నరేషన్ తర్వాత మహేష్ ఈ సినిమాకు పచ్చ జెండా ఊపేసినట్లు తెలిసింది. మహేష్‌ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు జూన్లో సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు సమాచారం. కథ ఓకే అయినప్పటికీ.. పక్కాగా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కావడానికి పరశురామ్ ఇంకొంత సమయం తీసుకోనున్నాడు. ఈ లోపు మహేష్ వేసవి సెలవుల్ని ఆస్వాదిస్తాడు. అతను ఒక లాంగ్ టూర్ వెళ్లనున్నట్లు సమాచారం.

ఇంతకుముందు మహేష్‌ను ట్రై చేసి ఫెయిలైన పరశురామ్.. నాగచైతన్యతో సినిమా ఓకే చేసుకున్నాడు. 14 రీల్స్ ప్లస్ బేనర్లో ఆ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఇంకో నెల రోజుల్లో షూటింగ్ కూడా మొదలుపెట్టాలనుకున్నారు. కానీ మహేష్ లాంటి పెద్ద హీరోతో పరశురామ్‌కు సినిమా చేసే అవకాశం రావడంతో చైతూతో పాటు 14 రీల్స్ వాళ్లూ అర్థం చేసుకుని ఈ సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English