దిల్ రాజు బేరం మహేష్ కి నచ్చలేదు

దిల్ రాజు బేరం మహేష్ కి నచ్చలేదు

అగ్ర హీరోలు అందరికి గత చిత్రానికి తీసుకున్న పారితోషికం కంటే కనీసం ఒక కోటి రూపాయలు అదనంగా తదుపరి చిత్రానికి తీసుకోవాలని ఉంటుంది. అందులోను గత చిత్రం హిట్ అయితే తమ రేట్ నిర్మాతలే పెంచుతారనే కోరిక ఉంటుంది. అయితే దిల్ రాజు మాత్రం ప్రాక్టికల్ మనిషి. హిట్ సినిమా తీసినా కానీ తనకి మిగిలేది ఏమి ఉండదంటే ఆ రిస్క్ చేయడానికి అతను ఇష్టపడడు.

సరిలేరు నీకెవ్వరూ కానీ, మహర్షి కానీ నిర్మాతకి మిగిల్చింది ఏమి లేదు. ఈ నేపథ్యంలో మహేష్ గత చిత్రానికి తీసుకున్నట్టు యాభై కోట్ల పారితోషికం కావాలంటే అది వర్కవుట్ కాదని దిల్ రాజుకి తెలుసు. అందుకే తన బ్యానర్ లో వంశీ పైడిపల్లితో సినిమా ఖరారు అయినా కానీ పారితోషికం పరంగా మహేష్ తో బేరానికి దిగాడు.

ఇది ఏమాత్రం ఊహించని మహేష్ అసలు ఈ ప్రాజెక్ట్ ఉండదనే న్యూస్ లీక్ చేయించాడు. ఎవరైతే తనకి సరిలేరుకి ఇచ్చిన దాంతో సమానంగా ఇస్తారో వారితోనే చేయాలనీ డిసైడ్ అయ్యాడు. ఎలాగో వచ్చే వేసవి వరకు తన కొత్త సినిమా విడుదల కాదు కనుక మహేష్ ఇంకా వెయిటింగ్ గేమ్ ఆడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English