చిరంజీవి చేయలేనిది పవన్ కళ్యాణ్ చేస్తాడా?

చిరంజీవి చేయలేనిది పవన్ కళ్యాణ్ చేస్తాడా?

సైరా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడినా కానీ చిరంజీవి ఆ వయసులో పడ్డ కష్టాన్ని మిగతా ప్రాంతాల వాళ్ళు గుర్తించలేదు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో సైరా డిజాస్టర్ అయింది. చిరంజీవికి ఎదురైనా పరాభవం గురించి తెలిసినా కానీ పవన్ కూడా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. క్రిష్ కి బాలీవుడ్ లో కాస్త గుర్తింపు ఉంది. ఎలాగో పవన్ తో అతను చేస్తున్న సినిమా కూడా జానపద శైలిలో ఉండే పీరియడ్ డ్రామా. అందుకే దీనిని పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమాగా మలిచే ప్రయత్నం జరుగుతోంది. అందుకే సపోర్టింగ్ క్యాస్ట్ కూడా హిందీ నటుల్ని తీసుకొస్తున్నారు.

ఇందులో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తాడట. అలాగే ఒక కథానాయికగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చేస్తుందట. వీళ్ళు ఉండడం వాళ్ళ బాలీవుడ్ మార్కెట్ వర్గాలే కాకుండా సినిమా ప్రియులు కూడా ఈ చిత్రాన్ని లెక్క చేస్తారని క్రిష్ భావిస్తున్నాడు. అందుకే బడ్జెట్ పెరుగుతున్నా కానీ ఏ ఎం రత్నం కూడా క్రిష్ కి ఫ్రీడమ్ ఇచ్చేసాడు. మరి చిరంజీవి వల్ల  కాని పాన్ ఇండియా మురిపెం పవన్ వల్ల అయినా మెగా అభిమానులకి తీరుతుందో లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English