ఎవరేమన్నా అనుకోనీ.. ప్రయోగాలు జాన్తానై

ఎవరేమన్నా అనుకోనీ.. ప్రయోగాలు జాన్తానై

ఒక నా ఆటోగ్రాఫ్‌.. ఒక సారొచ్చారు.. ఒక ఒక శంభో శివ శంభో.. ర‌వితేజ త‌న స్టైల్‌ను ప‌క్క‌న పెట్టి కొంచెం డిఫ‌రెంటుగా చేసిన సినిమాల వ‌రుస ఇది. ఇవ‌న్నీ మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్న‌వే. కానీ ఆడ‌లేదు. ఇవి కాక రొటీన్‌కు భిన్న‌మైన సినిమాలంటూ కొన్ని బ్యాడ్ మూవీస్ కూడా చేశాడు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ, డిస్కో రాజా ఆ కోవ‌కే చెందుతాయి.

కానీ ఇవేవీ ఆడ‌లేదు. మాస్ సినిమాలు చేసిన‌పుడు ఓపెనింగ్స్‌కు అయినా గ్యారెంటీ ఉండేది కానీ.. ఇలా డిఫ‌రెంట్ సినిమాలు తేడా కొట్టిన‌పుడు అస‌లుకే మోసం వ‌చ్చేస్తోంది. మార్కెట్ మీద ప్ర‌భావం ప‌డుతోంది. డిస్కో రాజా అలాంటి ఎఫెక్టే చూపించింది. ఇది హిట్ట‌యితే సీక్వెల్ కూడా చేయాల‌నుకున్నాడు కానీ.. మాస్ రాజాకు ఆ స్కోపే ఇవ్వ‌లేదా సినిమా. దీంతో ఇక ప్ర‌యోగాలు వ‌ద్దు బాబోయ్ అని దండం పెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది.

డిస్కో రాజా తర్వాత మాస్ రాజా త‌న స్ట‌యిల్లో చేస్తున్న సినిమా క్రాక్. అత‌డితో ఇంత‌కుముందు డాన్ శీను, బ‌లుపు లాంటి స‌క్సెస్ ఫుల్ సినిమాలు తీసిన గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమా మొద‌లైన‌పుడు పెద్ద‌గా అంచ‌నాల్లేవు. కానీ మొన్న టీజ‌ర్ బ‌య‌టికొచ్చాక క‌థ మారిపోయింది. అందులో కొన్ని షాట్లు, డైలాగులు చాలా స్టైలిష్‌గా, ఊర మాస్‌గా ఉండి మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

ఇది త‌మిళ హిట్ సేతుప‌తికి రీమేక్ అన్న సందేహాలు ఉన్న‌ప్ప‌టికీ.. జ‌నాల దృష్టిని ఆక‌ర్షించ‌డంలో టీజ‌ర్ విజ‌య‌వంత‌మైంది. దీనికి భారీగా వ్యూస్, లైక్స్ వ‌చ్చాయి. డిస్కో రాజా ఎఫెక్టే లేన‌ట్లుగా ఈ సినిమాకు క్రేజ్ క‌నిపిస్తోంది. బిజినెస్ ఆఫ‌ర్లు కూడా బాగానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదంతా చూశాక మాస్ రాజా క‌ష్ట‌మో న‌ష్ట‌మో పూర్తిగా మాస్ సినిమాల‌కే ప‌రిమితం కావాల‌ని, ప్ర‌యోగాల జోలికే వెళ్లొద్ద‌ని డిసైడైపోయాడ‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English