ప‌వ‌న్‌ను ఢీకొట్టేది ఎవ‌రంటే?

ప‌వ‌న్‌ను ఢీకొట్టేది ఎవ‌రంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ మూవీ చ‌క‌చ‌కా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప‌వ‌న్ కెరీర్లోనే అత్యంత వేగంగా పూర్తి కాబోతున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. మొద‌లైన నాలుగైదు నెల‌ల‌కే ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ప‌వ‌న్ కేవ‌లం 30 రోజుల కాల్ షీట్ల‌తో సినిమాను ఫినిష్ చేయ‌బోతున్నాడు.

ఈ చిత్రాన్ని మే 15న విడుద‌ల చేయబోతున్న‌ట్లు స్వ‌యంగా నిర్మాత దిల్ రాజే వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్ మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్క‌టే బ‌య‌టికి వ‌స్తున్నాయి. ప‌వ‌న్ లుక్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు సినిమాలో ఓ కీల‌క పాత్ర‌కు సంబంధించిన స‌మాచారం బ‌య‌టికొచ్చింది. సినిమాలో ప‌వ‌న్‌ను ఢీకొట్టే కీల‌క పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌బోతున్నాడు.

పింక్ మూవీలో యాక్ష‌న్ ఘ‌ట్టాలేమీ ఉండ‌వు. విల‌న్ల‌తో హీరో ఫైటింగ్ అంటూ ఏమీ ఉండ‌దు. లాయ‌ర్ అయిన అమితాబ్.. మ‌రో లాయ‌ర్ విసిరే స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడు. చివ‌రికి అత‌డిపై పైచేయి సాధిస్తాడు. హిందీలో ఆ పాత్ర‌లో పియూష్ మిశ్రా అద‌ర‌గొట్టాడు. ఇప్పుడు ఆ పాత్ర‌ను తెలుగులో ప్ర‌కాష్ రాజ్ చేయ‌బోతున్నాడు. లాయ‌ర్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ లుక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది.

కోర్టులో న‌ల్ల‌కోటుతో కూర్చుని ఉన్న ప్ర‌కాష్ రాజ్ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. న‌డి వ‌య‌స్కుడి పాత్ర‌లో ప్ర‌కాష్ క‌నిపించేట్లున్నాడు. గ‌తంలో జ‌ల్సా స‌హా కొన్ని సినిమాలో ప‌వ‌న్-ప్ర‌కాష్ కెమిస్ట్రీ భ‌లేగా పండింది. పింక్ రీమేక్‌లో సీరియ‌స్ పాత్ర‌ల్లో వీళ్లిద్ద‌రూ ఎలా పోటాపోటీగా  న‌టిస్తారు.. ఎవ‌రిని ఎవ‌రు డామినేట్ చేస్తారు అన్న‌ది ఆస‌క్తిక‌రం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English