పవన్ దగ్గర త్రివిక్రమ్ ప్లేస్ ఇతను కొట్టేశాడా?

పవన్ దగ్గర త్రివిక్రమ్ ప్లేస్ ఇతను కొట్టేశాడా?

పవన్ కళ్యాణ్ ని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కలవాలంటే ఇంత కాలం ఉన్న ఏకైక మార్గం త్రివిక్రమ్. పింక్ రీమేక్ కి దిల్ రాజు కూడా త్రివిక్రమ్ ద్వారానే పవన్ ని కలిసాడు. నిజానికి త్రివిక్రమ్ కి కూడా వాటా ఇస్తానని దిల్ రాజు మాట ఇచ్చి తర్వాత సైడ్ చేసాడు. ఒక్క సారి ఏ హీరో దగ్గర అయినా ఎంట్రీ దొరికితే ఇక దిల్ రాజు అల్లుకుపోతాడు. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా దిల్ రాజు బాగా క్లోజ్ అవుతున్నాడట. మహేష్ ఎలాగైతే దిల్ రాజుని బలంగా నమ్ముతున్నాడో పవన్ కూడా ఇప్పుడు రాజుతో నిత్యం మంతనాలు సాగిస్తున్నాడని అంటున్నారు.

ఇది వరకు పవన్ ని కలవాలంటే త్రివిక్రమ్ ఒకడే మార్గం. దాని వల్ల చాలా మంది దర్శకులు పవన్ ని రీచ్ అవలేకపోయేవారు. త్రివిక్రమ్ కి ఫోన్ చేసి పవన్ కి కథ చెప్తామని ఏ దర్శకుడు అయినా ఎలా అడుగుతాడు? కానీ దిల్ రాజు దగ్గర అలాంటి క్రియేటివ్ హెడ్ ఏక్స్ లేవు. ఎవరైనా హ్యాపీగా పవన్ ని కాంటాక్ట్ చేయవచ్చు. ఈ కారణంగా పవన్ ఎక్కువమందికి అందుబాటులోకి వచ్చాడట. పింక్ రీమేక్ మాత్రమే కాకుండా పవన్ తో దిల్ రాజు త్వరలో మరో సినిమా కూడా చేస్తాడనే టాక్ ఉంది. త్రివిక్రమ్ ఎలాగో ఇప్పట్లో పవన్ తో సినిమా చేసేది లేదు కనుక అతడిని రెగ్యులర్ గా కలిసే పని లేదు. దీంతో దిల్ రాజు పూర్తిగా పవన్ దగ్గర ప్లేస్ సొంతం చేసేసుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English