సూపర్ ఛాన్స్ వేస్ట్ చేసుకుంటున్న అల్లు అరవింద్!

సూపర్ ఛాన్స్ వేస్ట్ చేసుకుంటున్న అల్లు అరవింద్!

ఒటిటి ప్లాటుఫామ్ లోకి ముందుగా దిగిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్. మిగతా నిర్మాతలు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి పాపులర్ ఓటిటి ఆఫర్ చేస్తున్న డబ్బులతో సంతృప్తి చెందుతున్న టైంలో అరవింద్ ఆహా మొదలు పెట్టారు. అగ్ర నిర్మాతగా ఆయనకి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే బయటి సంస్థల కంటే నిర్మాతలు ఆహానే ప్రిఫర్ చేస్తారు. దీనివల్ల పోటీ వాతావరణంలో కూడా క్రేజీ సినిమాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అగ్రెసివ్ గా ఉండాల్సింది పోయి అరవింద్ డిఫెన్స్ టాక్టిక్స్ వాడుతున్నారు.

అవుట్ రైట్ గా డిజిటల్ రైట్స్ తీసుకోవడం కాకుండా ఎన్ని వ్యూస్ వస్తే దాన్ని బట్టి రెవిన్యూ షేరింగ్ అని బేరం పెడుతున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ అవుట్ రైట్ గా కోట్లు ఇస్తూ వుంటే ఎవరు మాత్రం ఇలాంటి ఆఫర్ కావాలని అనుకుంటారు? ఆహా విషయంలో ఇంతవరకు సరైన వ్యూహ రచన లేక వెనకపడ్డారు. ఒరిజినల్ కంటెంట్ అంటూ తీసినవి కూడా ఆకట్టుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం ఒక పది పదిహేను క్రేజీ సినిమాల హక్కులు సాధిస్తే తప్ప ఇది లాభసాటిగా మారదు. ముందు ఇన్వెస్ట్ చేసి తర్వాత లాభం చూడ్డానికి అరవింద్ ఇష్టపడడం లేదు. ఆ ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి వ్యాపారాల కంటే సినిమాలు తీసుకుని వాటి హక్కులు అమ్మేయడమే ఉత్తమం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English