భీష్మ రాంగ్ టైమింగ్ ఎఫెక్ట్!

భీష్మ రాంగ్ టైమింగ్ ఎఫెక్ట్!

ఏ సినిమాకి అయినా కథ, వినోదంతో పాటు రిలీజ్ టైమింగ్ కూడా కీలకమే. హిట్ టాక్ వచ్చిన సినిమా పండగల సీజన్లో లేదా హాలిడేస్ టైములో వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. భీష్మకి వచ్చిన టాక్ కి అప్పుడే కలెక్షన్స్ డ్రాప్ అవ్వకూడదు.

కానీ తొలి సోమవారం నాటికే తేడా బాగా కనిపించేసింది. ఆదివారం నుంచి సోమవారానికి వసూళ్లు గణనీయంగా తగ్గాయి. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే మార్చ్ నెలాఖరులో నాని సినిమా వి వచ్చే వరకు పెద్ద సినిమాలు లేవు. కనుక భీష్మకి లాంగ్ రన్ రావచ్చు.

కానీ ఇదే సినిమా సమ్మర్లో పడితే మాత్రం పెద్ద రేంజ్ కి వెళ్లి ఉండేదని ట్రేడ్ అభిప్రాయం. ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు కానీ వారం తిరగకుండా ఆ ముచ్చట అయితే తీరిపోతుంది. కానీ నితిన్ కి భారీ బ్లాక్ బస్టర్ సాధించే అవకాశం రాంగ్ టైమింగ్ వల్ల మిస్ అయింది.

మహా శివరాత్రి సెలవు ఒక్కటి కలిసి వస్తుందని భీష్మని వేసవి వరకు ఆపకుండా విడుదల చేసేసారు. అల వైకుంఠపురంలో చిత్రానికి వీకెండ్స్ బాగా హెల్ప్ అయ్యాయి కనుక ఇక భీష్మ కూడా అలా వారాంతాల మీద దిపెండ్ అవ్వాల్సి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English