తన పాటను చంపేశారంటున్న రెహమాన్

తన పాటను చంపేశారంటున్న రెహమాన్

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకం ఎ.ఆర్.రెహమాన్. రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నాక కూడా ఒద్దికగానే ఉన్నాడు.  ఆస్కార్ అందుకున్నాక నేరుగా చెన్నైకి రాకుండా మరెక్కడో సన్మానం చేయించుకున్నందుకు సీనియర్ నటుడు రాధా రవి విమర్శలు చేస్తే.. ఆయన తన మీద ఎక్కడి నుంచే ఉమ్మితే.. తన ముఖం పైనే పడిందంటూ చమత్కరించిన గొప్ప వ్యక్తి రెహమాన్.

మూడు దశాబ్దాల కెరీర్లో రెహమాన్ ఎవ్వరినీ ఎప్పుడూ బహిరంగ వేదికల్లో పల్లెత్తు మాట అనిన సందర్భాలు దాదాపు లేవు. ఎవరి మీదా విమర్శలు చేయడానికి కూడా రెహమాన్ ఇష్టపడడు. అలాంటి వాడు తన పాట రీమిక్స్ విషయంలో అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ పాటను చంపేశారంటూ రెహమాన్ పెద్ద కామెంటే చేశాడు.

తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘99 సాంగ్స్’ ప్రమోషన్లలో భాగంగా రీమేక్స్ పాటల గురించి అడిగినపుడు రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రీమిక్స్ చేసినపుడు జాగ్రత్తగా ఉండాలని.. పాటను కంపోజ్ చేయడం అటుంచితే.. ఒరిజినల్ చేసిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వడం, గౌరవించడం కూడా ముఖ్యమని రెహమాన్ అన్నాడు. తన పాటల రీమిక్స్ గురించి అడిగితే.. ‘ఈశ్వర్ అల్లా’ పాటను రీమిక్స్ చేసిన వాళ్లు దాదాపుగా దాన్ని చంపేశారని రెహమాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆమిర్ ఖాన్ నటించిన 1947 సినిమా కోసం కంపోజ్ చేసిన ఈశ్వర్ అల్లా పాట అప్పట్లో సూపర్ హిట్. దాన్ని పీఎం నరేంద్రమోడీ సినిమాలో రీమిక్స్ చేసి వాడుకున్నారు. ఆ పాటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రాపగండా ఫిలింలో అలాంటి పాటేంటి అన్నారు. అసలు ఈ పాట విషయంలో రెహమాన్‌ను సంప్రదించలేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మోడీ మీద తీసిన సినిమా కావడంతో లైట్ తీసుకున్నట్లున్నారు. ఈ విషయంలో హర్టయిన రెహమాన్.. తన పాటను చంపేశారంటూ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English