యుఎస్ తెలుగు ఆడియ‌న్స్.. షాక్ మీద షాక్

యుఎస్ తెలుగు ఆడియ‌న్స్.. షాక్ మీద షాక్

యుఎస్ తెలుగు ప్రేక్ష‌కుల మీద ట్రేడ్ వ‌ర్గాల‌కు ఒక అంచ‌నా ఉంది. వాళ్లు క్లాస్ ల‌వ్ స్టోరీలంటే.. కొత్త త‌ర‌హా సినిమాల‌న్నా బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ని.. ఒక ఫార్మాట్లో సాగిపోయే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ల‌ను అంత‌గా ఆద‌రించ‌ర‌ని గ‌త బాక్సాఫీస్ రికార్డుల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. కానీ ఈ మ‌ధ్య వాళ్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ నెల తొలి వారంంలో వ‌చ్చిన ప్యూర్ క్లాస్ ల‌వ్ స్టోరీ జానును అక్క‌డి వాళ్లు అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఈ త‌ర‌హా ప్రేమ‌క‌థ‌లు గ‌తంలో బాగా ఆడాయి. కానీ ఈసారి మాత్రం యుఎస్ బాక్సాఫీస్‌లో భిన్న‌మైన ఫ‌లితం వ‌చ్చింది. జానుకు విడుద‌ల ఖ‌ర్చులు మాత్ర‌మే వ‌సూలైన ప‌రిస్థితి. ఇది టాలీవుడ్‌కు యుఎస్ ఆడియన్స్ ఇచ్చిన పెద్ద షాక్. బ్యాడ్ టాక్ తెచ్చుకున్న మరో ప్రేమకథ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను కూడా అక్కడి జనాలు పట్టించుకోలేదు.

సంక్రాంతి తర్వాత దాదాపుగా ఏ సినిమానూ యుఎస్ ఆడియ‌న్స్ ఆదరించలేదు. దీంతో ఇప్పుడు వాళ్లు సినిమాలు చూసే మూడ్‌లో లేరేమో అనుకున్నారంతా. కానీ శుక్ర‌వారం రిలీజైన భీష్మ యుఎస్ బాక్సాఫీస్‌లో అద్భుతాలు చేస్తోంది. ఈ సినిమాకు మంచి టాకే వ‌చ్చినా.. ఇలాంటి ఫార్ములా సినిమాల్ని యుఎస్ ఆడియ‌న్స్ ఏమాత్రం ప‌ట్టించుకుంటారో అన్న సందేహాలు క‌లిగాయి. కానీ ఈ చిత్రం ఆ సందేహాల్ని ప‌టాపంచ‌లు చేసింది. వీకెండ్లో భారీ వ‌సూళ్ల‌తో శ‌నివారానికే హాఫ్ మిలియ‌న్ మార్కుకు చేరువైంది.

ఆదివారం ఆ మార్కును దాటేసింది. భీష్మ‌కు అక్క‌డ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయి బ‌య్య‌ర్ లాభాల బాట ప‌ట్ట‌డం విశేషం. ఇది కచ్చితంగా టాలీవుడ్‌కు మరో షాకే. ‘అఆ’ త‌ర్వాత నితిన్‌కు యుఎస్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్ట‌య్యేలా ఉంది. ఫుల్ ర‌న్లో ఈ చిత్రం 8 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
    

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English