వారం తిరగకుండా లాభాల్లోకి!

వారం తిరగకుండా లాభాల్లోకి!

సంక్రాంతికి వచ్చిన రెండు భారీ సినిమాల తర్వాత వచ్చిన సినిమా వాచినట్టు బాల్చీ తన్నేసింది. కానీ నితిన్ భీష్మ మాత్రం మొదటి ఆట నుంచే హిట్ టాక్ తో అదరగొట్టింది. మొదటి రోజు కంటే రెండవ రోజు, రెండవ రోజు కంటే మూడవ రోజు వసూళ్లు పెరుగుతూ పోయాయి. సోమవారం నుంచి కలెక్షన్స్ పరంగా కాస్త దూకుడు తగ్గుతుంది. అయితే మొదటి వారం తిరగకుండానే భీష్మ బయ్యర్లు అందరు లాభాల్లోకి వెళ్లిపోతారు. పాతిక కోట్ల షేర్ వస్తే ఈ చిత్రం హిట్ కిందే లెక్క. ఈజీగా ముప్పై అయిదు కోట్ల వరకు షేర్ వస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

త్రివిక్రమ్ తీసిన అ ఆ మినహాయిస్తే నితిన్ సినిమాలలో అత్యధిక వసూళ్లు తెచ్చుకునే చిత్రం ఇదే అవుతుంది. వరసగా రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములకి డిమాండ్ పెరిగింది. ఆల్రెడీ అతనికి రెండు పెద్ద నిర్మాణ సంస్థలు అడ్వాన్సులు ఇచ్చి ఉన్నాయి. ఇప్పుడు యువ హీరోలలో చాలా మంది అతనితో చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English