సైరా నష్టాలకి వడ్డీలు కడుతున్న చరణ్?

సైరా నష్టాలకి వడ్డీలు కడుతున్న చరణ్?

సైరా చిత్రం తెలుగు వెర్షన్ వరకు తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా షేర్ సాధించింది కానీ ఇతర భాషల్లో దారుణంగా ప్లాప్ అయింది. అయితే పర బాషల నుంచి కూడా డబ్బులు వస్తాయని నమ్మి ఆ చిత్రంపై చరణ్ చాలా ఖర్చు పెట్టేసాడు. భారీగా బ్యాంకు రుణాలు తెచ్చి సినిమాలో ఇన్వెస్ట్ చేసాడు.

అయితే ఆ అప్పులు తీర్చేంత డబ్బు వెనక్కి రాకపోవడం, తాను దగ్గరుండి చూసుకోక పోవడంతో చాలా ఖర్చులకి లెక్కలు తేలకపోవడంతో భారీగా నష్టాలూ మిగిలాయి. దాంతో చరణ్ ఇప్పటికీ ఆ అప్పులకి వడ్డీలు కడుతున్నాడు.

కోట్ల రూపాయల ఋణం తీసుకోవడంతో చిరంజీవి ఆచార్య చిత్రం లాభాలు తెస్తే చరణ్ ఆ అప్పు కాస్త అయినా తీర్చగలడు. ఈ చిత్రానికి వచ్చిన నష్టాలూ చిరంజీవిని కూడా అసహనానికి లోను చేశాయట. ముఖ్యంగా పైకి తేలని లెక్కలే కోట్ల రూపాయల్లో ఉన్నాయట. అందుకే ఇక మీదట కొణిదెల ప్రొడక్షన్స్ ఫై సినిమా వద్దని తండ్రీ కొడుకులు డిసైడ్ అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English