'అ'ది హిట్టే, కానీ సీక్వెల్ చేయడు!

'అ'ది హిట్టే, కానీ సీక్వెల్ చేయడు!

నాని నిర్మాతగా తొలి చిత్రం అ విలక్షణ ప్రయత్నంగా ప్రశంసలు అందుకుంది. ఓవర్సీస్, ఏ సెంటర్స్ లో బానే ఆడింది. అయితే నిర్మాతగా నానికి వచ్చిన లాభాలు బయ్యర్లకి రాలేదు. ఆ సినిమాకి బాగా డబ్బులొచ్చాయ్ అని, హిట్ సినిమా తీశానని నాని పనిగట్టుకుని 'హిట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. స్పీచ్ మధ్యలో గుర్తు చేసుకుని మరీ ఇది చెప్పాడు.

అయితే ఆ చిత్రానికి సీక్వెల్ తియ్యడానికి అదే దర్శకుడు కథ రెడీ చేసుకుని నిర్మాత కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడంటే హిట్ సినిమా అని చెప్తున్ననాని ఆ చిత్రాన్ని ఎందుకు తీయడం లేదు? మొదటి సినిమా హిట్ అయితే దాని సీక్వెల్ ని కాష్ చేసుకునే అవకాశం ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? అ కి వచ్చిన లాభాల వాళ్ళ ఏకంగా తనపై ఐటీ రైడ్ జరిగిందని నాని జోకేశాడు. కానీ సీక్వెల్ జోలికి మాత్రం పోడు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English