ఆ సీక్రెట్ అడిగితే సమాధానం చెప్పని జక్కన్న

ఆ సీక్రెట్ అడిగితే సమాధానం చెప్పని జక్కన్న

బహుశా ఇండియన్ ఫిలిం హిస్టరీ తీస్తే పదికి పైగా సినిమాలు తీసిన దర్శకుల్లో అసలు అపజయం అంటూ లేని దర్శకుడిగా ఒక్క రాజమౌళి పేరే ఉంటుందేమో. ఎంత గొప్ప దర్శకుడైనా ఏదో ఒక దశలో తప్పటడుగు వేయడం.. ఫ్లాప్ ఎదుర్కోవడం మామూలే. వరుస హిట్ల తర్వాత వచ్చే అంచనాల ఒత్తిడిని తట్టుకోవడం.. ప్రతిసారీ హిట్ సినిమాను డెలివరీ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ రాజమౌళి మాత్రం ఇందుకు మినహాయింపుగా వస్తున్నాడు.

తొలి చిత్రం ‘స్టూడెంట్ నంబర్‌వన్’ మొదలుకుని.. చివరగా తీసిన ‘బాహుబలి’ వరకు ఆయనకు అపజయం అన్నదే తెలియదు. ‘సై’ మూవీ మిగతా వాటిలా సూపర్ హిట్టో బ్లాక్ బస్టరో కాకపోయి ఉండొచ్చు కానీ.. అది కూడా సక్సెస్ ఫుల్ మూవీనే. మరి ఇలా వరుసగా రాజమౌళి ఎలా హిట్టు కొట్టగలుగుతున్నాడు.. ఆయన విజయ రహస్యం ఏంటి అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.

ఇదే ప్రశ్న ‘హిట్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో అడిగింది యాంకర్ సుమ. ఈ వేడుకకు వచ్చిన అతిథులు ఒక్కొక్కరిని వేదిక మీదికి పిలిచి.. సినిమా థీమ్‌కు తగ్గట్లుగా మీపై ఫలానా కేసు నమోదైంది.. దీనికి మీ సమాధానం ఏంటి అని అడుగుతూ వచ్చింది సుమ. రాజమౌళి వచ్చినపుడు ముందుగా ‘ఆర్ఆర్ఆర్’ టీంకు సంబంధించిన కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ల భార్యలు, పిల్లలు.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ‌్‌ల అభిమానులు.. వాళ్లకు ఎప్పుడు విడుదల అని అడుగుతున్నారని.. దానికి మీ సమాధానం ఏంటని అడిగింది సుమ.

వచ్చే ఏడాది జనవరి 8న సినిమా  కాబట్టి ఆ రోజే వాళ్ల విడుదల ఉంటుందని అన్నాడు జక్కన్న. తర్వాత అపజయం అన్నదే తెలియకుండా వరుసగా ఎలా హిట్లు కొట్టగలుగుతున్నారు.. ఆ రహస్యం ఏంటి.. దీనికి సంబంధించి మీపై కేసు పెట్టారు అని సుమ అంటే.. ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు.. వీటిపై కేసులు పెట్టకూడదు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు.. మీ బైలాస్‌ చూసి తెలుసుకోండి అంటూ సుమ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు రాజమౌళి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English