అనుష్క వలపు బాణానికి అభిమానులు ఫిదా

అనుష్క వలపు బాణానికి అభిమానులు ఫిదా

దక్షిణాదిన హీరోలతో సమానంగా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె బాక్సాఫీస్ దగ్గర తన సత్తాను చూపించింది. ఇవి కాక ‘బాహుబలి’ సహా మరెన్నో సినిమాల్లో ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. భారీగా అభిమానగణాన్ని సంపాదించుకుంది.

30 ప్లస్‌లో కూడా బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపిస్తూ వస్తున్న అనుష్క.. సరైన ఫిజిక్‌తో ఉంటే నయనతార లాగా దూసుకెళ్లేదేమో. కానీ ‘సైజ్ జీరో’ కోసం బలవంతంగా షేప్ ఔట్ అయిన ఆమె.. మళ్లీ అందంగా తయారవడానికి ఎంత కష్టపడుతున్నా ఫలితం ఉండట్లేదు. అప్పుడప్పడూ పర్వాలేదన్నట్లుగా తయారై.. మళ్లీ షేప్ ఔట్ అయి కనిపిస్తోంది. సినిమాల్లో ఆమె లుక్‌ వెనుక ఎఫెక్ట్స్ ఉన్నాయనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ఈ మధ్య ఎయిర్ పోర్టులో అనుష్క చాలా బ్యాడ్ షేప్‌లో కనిపించడం అభిమానుల్ని నిరాశ పరిచింది. ఐతే ఆ ఫోటో తీయడంలోనే ఏదో తప్పు జరిగిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏదైనా ఈవెంట్‌కు వస్తే తప్ప అనుష్క ఒరిజినల్ లుక్ ఎలా ఉందో ఓ అంచనాకు రాలేని పరిస్థితి. ఇలాంటి సమయంలోనే తన మిత్రురాలు ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ‘హిట్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చింది అనుష్క. ఇక్కడ ఆమెను చూసి అభిమానులు మురిసిపోయారు.

కొన్నేళ్ల కిందటి స్థాయిలో కాదు కానీ.. ఈ ఈవెంట్లో అనుష్క అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. బరువు మరీ తగ్గిపోలేదు. అలాగని ఎక్కువగానూ లేదు. ఫేస్‌లో మంచి గ్లోతో కనిపించిన అనుష్క ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఈ ఈవెంట్లో సరదాగా ఆమె ధనుస్సు పట్టి విసిరిన వలపు బాణాలు అభిమానుల గుండెల్లోకి సూటిగా గుచ్చుకున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English