మహేష్-పరశురామ్.. అసలేంటి సంగతి?

మహేష్-పరశురామ్.. అసలేంటి సంగతి?

కెరీర్ ఆరంభం నుంచి మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు పరశురామ్. చివరగా అతను విజయ్ దేవరకొండతో చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయినా.. ఏకంగా రూ.70 కోట్ల దాకా షేర్ రాబట్టినా అతడికి పెద్ద హీరోల నుంచి పిలుపు రాలేదు. మహేష్ బాబు కోసం ప్రయత్నించినా.. అతను ఏ విషయం తేల్చలేదు. దీంతో మరోసారి మీడియం రేంజ్ హీరో అయిన నాగచైతన్యతోనే సర్దుకుపోవాలనుకున్నాడు.

‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ బేనర్లో ఈ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. చైతూ ‘లవ్ స్టోరి’ పూర్తి చేయగానే ఈ చిత్రం పట్టాలెక్కాల్సి ఉంది. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. ఊహించని పరిణామం జరిగింది. మహేష్ బాబు నుంచి పరశురామ్‌కు పిలుపొచ్చింది.

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సిన మహేష్.. దాన్ని క్యాన్సిల్ చేశాడంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్ బయటికి వచ్చింది పరశురామ్ సన్నిహితుల ద్వారానే కావడం గమనార్హం. ఎందుకంటే ఈ విషయాన్ని మహేష్ కానీ, వంశీ కానీ బయటికి వెల్లడించే అవకాశమే లేదు. పరశురామ్ సన్నిహితుల సమాచారం ప్రకారం.. వారం కిందట అతడికి మహేష్ నుంచి కాల్ వచ్చింది.

గత ఏడాది మధ్యలో చెప్పిన లైన్ మీద వర్క్ చేసి బౌండ్ స్క్రిప్టుతో రావాలని అతను చెప్పాడు. పరశురామ్ చెప్పిన లైన్ నచ్చినా.. అప్పటికి ఉన్న కమిట్మెంట్ల వల్ల ఏ విషయం తేల్చలేదు మహేష్. పైగా పరశురామ్ లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్‌తో సినిమా చేయాలా అనే సంశయం కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వంశీ స్క్రిప్టు నచ్చలేదు. వెంటనే తనకోసం కొత్తగా స్క్రిప్టు రెడీ చేసి రెండు మూడు నెలల్లో సినిమా మొదలుపెట్టే దర్శకుడెవరూ కనిపించడం లేదు. దీంతో పరశురామ్‌ను లైన్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English