కొత్త సినిమా మెడకు చుట్టుకున్న ప్లాప్ హ్యాట్రిక్

కొత్త సినిమా మెడకు చుట్టుకున్న ప్లాప్ హ్యాట్రిక్

శర్వానంద్ నిన్న మొన్నటి వరకు చాలా డిమాండ్ లో ఉన్న హీరో. కానీ సినీ పరిశ్రమలో ఓడలు బళ్ళు అవడానికి ఎంతో సమయం పట్టదు. వరుసగా మూడు పరాజయాలు పడడంతో శర్వానంద్ డిమాండ్ ఇప్పుడు సగానికి పడిపోయింది. జానుతో మళ్ళీ పుంజుకుంటానని శర్వానంద్ నమ్మాడు కానీ అది రివర్స్ అయింది. ఆ సినిమా తన గత రెండు ప్లాపుల కంటే పెద్దగా ఫెయిల్ అయింది. దీంతో శర్వా తదుపరి చిత్రం శ్రీకారం బిజినెస్ ఎఫెక్ట్ అవుతోంది.

శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం ఇంత వరకు ఎవరు రాలేదు. అలాగే బిజినెస్ పరంగా కూడా ఆఫర్స్ రావడం లేదు. శర్వా మార్కెట్ పడిపోవడంతో మునుపటి రేట్స్ ఇవ్వడానికి బయ్యర్లు వెనకాడుతున్నారు. కానీ శర్వా మునుపటి మార్కెట్ కి అనుగుణంగానే ఈ చిత్రానికి బడ్జెట్ వేసుకుని, అతనికి పారితోషికం ఇచ్చిన 14 రీల్స్ వారికి ఇప్పుడు ఆ రేట్స్ రావడం లేదు. దీంతో ఏప్రిల్ 24 అని రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తారని వినిపిస్తోంది.

బహుశా శర్వానంద్ ముందుగా మాట్లాడుకున్న పారితోషికం తగ్గించుకుంటే నిర్మాతలకి కాస్త భారం తగ్గవచ్చు. అయితే చాలా భాగం షూటింగ్ పూర్తయింది కనుక ఇప్పుడు బడ్జెట్ పరంగా అడ్జస్టుమెంట్లు చేయడం అంత తేలిక కాదు.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English