వామ్మో వాయ్యో.. ఇదేం లుక్కయ్యో

వామ్మో వాయ్యో.. ఇదేం లుక్కయ్యో

ఒకప్పుడు బాడీ అంటే బాలీవుడ్ హీరోలదే అన్నట్లుగా ఉండేది. కండలు పెంచడం, సిక్స్‌ ప్యాక్‌లు చేయడంలో వాళ్లను మించిన వాళ్లే లేరన్న అభిప్రాయం బలంగా ఉండేది. సల్మాన్ ఖాన్‌తో మొదలైన ఈ ట్రెండు.. ఆ తర్వాత కూడా కొనసాగింది. సిక్స్ ప్యాక్ చేయకపోతే హీరోనే కాదన్నట్లుగా ఉండేది బాలీవుడ్ వ్యవహారం.

ఐతే సౌత్ హీరోలు కొంచెం లేటుగా బాడీ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. దక్షిణాదిన సిక్స్ ప్యాక్ ట్రెండుకు తెరతీసిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడని చెప్పాలి. అతడికంటే ముందే అర్జున్ లాంటి వాళ్లు చిజిల్ బాడీలతో ఆకట్టుకున్నప్పటికీ ‘దేశముదురు’ సినిమాతో బన్నీ ఈ ట్రెండుకు ఊపు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత చాలామంది యంగ్ హీరోలు సిక్స్ ప్యాక్స్ మీద ఫోకస్ పెట్టారు. ఐతే ఇప్పటిదాకా మిగతా సౌత్ హీరోలందరూ తమ బాడీల్ని తీర్చిదిద్దుకున్న తీరు ఒకెత్తయితే.. ఇప్పుడు ఆర్య తన బాడీని మార్చుకున్న వైనం మరో ఎత్తు.

ఈ మధ్య సినిమాలు పెద్దగా హిట్ కాక కొంచెం వెనుకబడిపోయి ఉన్నాడు ఆర్య. మధ్యలో సాయేషా సైగల్‌తో పెళ్లి వల్ల కూడా సినిమాల్లో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇలాంటి టైంలో ఓ కొత్త సినిమా కోసం అతను తన లుక్‌లో మైండ్ బ్లోయింగ్ అనే రీతిలో మార్చుకున్నాడు. నిన్న సాయంత్రం ఒక వెబ్ సైట్ వాళ్లు.. ఈ లుక్ ఎవరితో చెప్పండి అంటూ ఆర్యను వెనుక నుంచి చూపిస్తూ ఒక ఫొటో పెట్టారు. అది చూస్తే జనాలకు దిమ్మదిరిగిపోయింది. అక్కడున్నది ఆర్య అని కొందరు గుర్తు పట్టారు కానీ.. ఓ సౌత్ హీరో బాడీ బిల్డర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇలా తయారు కావడం షాకింగే.
తర్వాత ఆర్య ముందు నుంచి కూడా తన బాడీని చూపించాడు. చేతులపై నరాలు తేలి ఉన్న అతడి ఫొటో ఒకటి చూస్తే వావ్ అనిపించక మానదు. బీస్ట్ మోడ్‌ ఆర్య అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ ఫొటోల్ని ట్రెండ్ చేస్తున్నారు అతడి అభిమానులు.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English