మృత్యు కేన్ బీభత్సం.. కాజల్ అగర్వాల్ కళ్ల ముందే

 మృత్యు కేన్ బీభత్సం.. కాజల్ అగర్వాల్ కళ్ల ముందే

ఇండియన్-2 సెట్స్‌లో బుధవారం జరిగిన భయానక ఘటన దేశ్యవాప్తంగా వివిధ సినీ ఇండస్ట్రీల్ని విస్మయానికి గురి చేసింది. సినీ జనాలు ఎలాంటి పరిస్థితుల మధ్య పని చేస్తారో.. ఎంత రిస్క్ ఉంటుందో ఈ ఉదంతం రుజువు చేసింది. ముగ్గురి ప్రాణాల్ని బలిగొన్న ఈ ఘటన.. దాదాపు పది మంది తీవ్ర గాయాల పాలయ్యేలా చేసింది.

అదృష్టం కొద్దీ ఈ చిత్ర దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీళ్లు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడం గమనార్హ. వాళ్లలో ఎవరికైనా ఏమైనా అయ్యుంటే భారతీయ సినీ పరిశ్రమ చరిత్రలోనే ఇది పెను విషాదం అయ్యుండేది. అయితే రెప్పపాటులో ఆ ముగ్గురూ ప్రమాదం తప్పించుకోవడం.. తమ కళ్ల ముందే ఆ ఘటన చోటు చేసుకోవడంలో పెద్ద షాక్‌లో ఉన్నారు.

కాజల్ అగర్వాల్‌కు కొన్ని అడుగుల దూరంలోనే ఆ క్రేన్ కూలడం గమనార్హం. ప్రమాద ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు గమనిస్తే.. క్రేన్ పక్కనే ఒక టెంట్ వేసి ఉండటాన్ని గమనించవచ్చు. అక్కడే కెమెరా సెటప్ ఉందట. దాని పక్కనే దర్శకుడు శంకర్‌తో పాటు హీరోయిన్ కాజల్ కూడా ఉందట.

రెప్పపాటులో తాను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని.. ఈ ఘటన తనను షాక్‌కు గురి చేసిందని.. తన కళ్ల ముందు ముగ్గురు చనిపోవడం, అంతమంది గాయపడటం తనను తీవ్ర కలవరపాటుకు గురి చేసిందని చెప్పింది కాజల్. ఈ ఘటనను ఊహించుకుంటేనే భయానకంగా అనిపిస్తోంది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు కాజల్‌తో పాటు శంకర్, కమల్ అదృష్టవంతులే. ఈ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకుని ఇకపై ఇలాంటి భారీ సామగ్రితో చిత్రీకరణ జరిపేటపుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English