నితిన్.. 18 ఏళ్లు.. 40 ఏళ్లు.. 60 ఏళ్లు

నితిన్.. 18 ఏళ్లు.. 40 ఏళ్లు.. 60 ఏళ్లు

కెరీర్లో ఎక్కువ‌గా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్లే చేశాడు నితిన్. అప్పుడ‌ప్ప‌డూ కొంచెం రూటు మార్చి ప్రేమ‌క‌థ‌లు చేశాడు కానీ.. ప్ర‌యోగాల జోలికి ఎప్పుడూ వెళ్ల‌లేదు. అయితే త్వ‌ర‌లో అత‌ను ఓ సాహ‌సోపేత సినిమాను మొద‌లుపెట్ట‌బోతున్నాడు. లిరిసిస్ట్ ట‌ర్న్డ్ కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో అత‌ను న‌టించ‌బోతున్న ఆ సినిమా పేరు.. ప‌వ‌ర్ పేట‌. దీని గురించి గ‌త ఏడాదే అనౌన్స్ చేశారు.

అప్పుడే జ‌నాల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి క‌నిపించింది. ఈ చిత్రాన్ని రెండు మూడు భాగాలుగా తీయ‌బోతుండ‌ట‌మే ఆ ఆస‌క్తికి కార‌ణం. త‌మిళంలో ధ‌నుష్-వెట్రిమార‌న్ జోడీ చేసిన వ‌డ చెన్నై త‌ర‌హాలో ఈ సినిమాను తీర్చిదిద్దాల‌ని అనుకుంటోంది కృష్ణ‌చైత‌న్య‌-నితిన్ టీం. భీష్మ ప్ర‌మోష‌న్ల కోసం మీడియాను క‌లిసిన నితిన్ ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విశేషాలు చెప్పాడు.

ప‌వ‌ర్ పేట పెద్ద స్పాన్‌ ఉన్న కథ అని..రెండు లేదా మూడు పార్టులుగా ఈ సినిమా రాబోతోందని… ఇప్పటికే కథ కూడా రెడీగా ఉందని నితిన్ చెప్పాడు. ఈ కథ 1960 – 2020 వరకూ న‌డుస్తుంద‌ని.. ఇందులో క‌థ‌కు అనుగుణంగా తాను  18 ఏళ్ల యువకుడిగా..  40 ఏళ్ల వ్యక్తిగా... 60 ఏళ్ల ముసలివాడిగా మూడు భిన్న‌మైన గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్న‌నాట్లు కూడా  నితిన్ వెల్ల‌డించాడు.

ప‌వ‌ర్ పేట‌ తన కెరీర్ కే అరుదైన సినిమా అని.. తెలుగులో కూడా ఇదో ప్ర‌త్యేక‌మైన సినిమా అవుతుంద‌ని నితిన్  అంటున్నాడు. ఈ ఏడాది ఆగష్టు నుండి ‘పవర్‌ పేట’ షూటింగ్‌ మొదలుపెడతామ‌ని.. త‌మ సొంత బేన‌ర్లోనే ఈ సినిమా ఉంటుంద‌ని నితిన్ వెల్ల‌డించాడు. కృష్ణ‌చైత‌న్య‌తో ఇంత‌కుముందు నితిన్ న‌టించిన చ‌ల్ మోహ‌న్ రంగ ఫ్లాప్ అయింది. అయిన‌ప్ప‌టికీ కృష్ణ‌చైత‌న్య‌ను న‌మ్మి ఇంత భారీ ప్రాజెక్టును అప్ప‌గించ‌డం విశేష‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English