ఇండియ‌న్- సెట్స్‌లో ఘోర ప్ర‌మాదం.. ముగ్గురి మృతి

ఇండియ‌న్- సెట్స్‌లో ఘోర ప్ర‌మాదం.. ముగ్గురి మృతి

కమల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌లో త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2 షూటింగ్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయార‌ని.. ప‌ది మంది దాకా తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని వార్త‌లొస్తున్నాయి. చ‌నిపోయిన వారిలో ఇద్ద‌రు ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌గ్గ‌ర చాలా కాలంగా ప‌ని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌ని.. మ‌రో టెక్నిక‌ల్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడ‌ని అంటున్నారు.

శంక‌ర్ సైతం తీవ్రంగా గాయ‌ప‌డ్డాడ‌ని.. ఆయ‌న కాలు బాగా ఫ్రాక్చ‌ర్ అయింద‌ని వార్త‌లొస్తున్నాయి. కానీ అది నిజం కాద‌ని స‌మాచారం. ఆయ‌న‌తో పాటు క‌మ‌ల్ హాస‌న్ కూడా సుర‌క్షిత‌మే అంటున్నారు. ఈ విష‌యాన్ని యూనిట్ స‌భ్యులు ధ్రువీక‌రించారు. 150 అడుగులు లైట్లు అమ‌ర్చిన క్రేన్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలి సెట్స్‌లో ఉన్న వారిపై ప‌డ‌టంతో ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుందంటున్నారు. క్రేన్ కూలిన దృశ్యాలు ట్విట్ట‌ర్లో వైర‌ల్ అవుతున్నాయి.

భార‌తీయుడు-2 సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర జరుగుతోంది.శంక‌ర్ సినిమా అంటే భారీత‌నానికి కేరాఫ్ అడ్ర‌స్‌. కొన్నిరోజులుగా రాత్రి పూట భారీ స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నాడు శంక‌ర్. ఇందుకోసం 150 అడుగుల ఎత్తులో ఫ్ల‌డ్ లైట్ల త‌ర‌హాలో లైటింగ్ ఏర్పాటు అవ‌స‌ర‌మైంది. ఈ లైట్ల‌ను క్రేన్ సాయంతో ఆ ఎత్తులో పెట్టి చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. మ‌రి వంద‌ల కిలోల బ‌రువున్న ఆ క్రేన్ ఎందుకు కూలింద‌న్న‌ది తెలియ‌దు కానీ.. అది ప‌డ్డ స‌మ‌యంలో ప‌దుల సంఖ్య‌లో యూనిట్ స‌భ్యులు సెట్లో ఉండ‌టంతో  న‌ష్టం ఈ స్థాయిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English