కోలీవుడ్ కుర్రాడు.. ఓ సెన్సేషనల్ సినిమా

కోలీవుడ్ కుర్రాడు.. ఓ సెన్సేషనల్ సినిమా

తమిళంలో వీడియో జాకీగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత ధనుష్‌తో ఉన్న స్నేహం వల్ల సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుని.. ఆపై హీరోగా అరంగేట్రం చేసి ప్రతిభ చాటుకుని.. వరుస హిట్లతో చాలా తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగిన కుర్రాడు శివ కార్తికేయన్. 'రెమో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా అతను కొంత పరిచయమే.

మధ్యలో కొన్ని ఫ్లాపులు శివను కొంచెం వెనక్కి లాగినా.. గత ఏడాది చివర్లో 'హీరో' సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడతను. ప్రస్తుతం శివ హీరోగా 'డాక్టర్' అనే సినిమా ఒకటి తెరకెక్కుతోంది. ఇది కాక తాజాగా 'అలయాన్' అనే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రలో కోలమావు కోకిల (తెలుగులో కోకో కోకిల) చిత్రాన్ని రూపొందించిన నెల్సన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

తాజాగా రిలీజ్ చేసిన 'అలయాన్' ఫస్ట్ లుక్ ఆసక్తికరంగానే అనిపించింది. శివ నోట్లో చేతిలో మిఠాయి పెట్టుకుని ఉంటే.. పక్కనే ఒక ఏలియన్ కూడా మిఠాయి పట్టుకుని ఉంది. ఇండియాలో ఇంత వరకు రాని కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు చెబుతున్నారు. గతంలో భారతీయ దర్శకులు కొన్ని జాంబీ మూవీస్ తీశారు కానీ.. ఇలాంటి ఏలియన్ కాన్సెప్ట్‌ను ఎవరూ టచ్ చేయలేదు. మనం అలాంటివి డీల్ చేయగలం అనే ధైర్యం ఇప్పటిదాకా దర్శకుల్లో రాలేదు. ఐతే నెల్సన్ ఈ సాహసం చేస్తున్నాడు.

ఇలాంటి వినూత్న ప్రయత్నం ముందు తమిళంలో జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి హాలీవుడ్లో మాదిరి అథెంటిగ్గా, భారీ స్థాయిలో ఓ ఏలియన్ మూవీని ఓ తమిళ దర్శకుడు తీయగలడా అన్నది చూడాలి. అసలు ఏ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టకుండా సినిమా తీసినా గొప్పే. ఈ చిత్రాన్ని బాహుబలి, కేజీఎఫ్ తరహాలో ఒకేసారి ఐదు భాషల్లో తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English