‘అరవింద సమేత’ కన్నా దీనికి డబుల్

‘అరవింద సమేత’ కన్నా దీనికి డబుల్

క్రేజీ కాంబినేషన్ రిపీటవుతోంది. ‘అరవింద సమేత’తో తొలిసారి జట్టు కట్టిన జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి మళ్లీ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’తో మెగా హిట్ కొట్టిన త్రివిక్రమ్.. దీని తర్వాత తాను చేయబోయేది ఎన్టీఆర్ సినిమానేనని ఇంతకుముందే ఖరారు చేశాడు.

త్రివిక్రమ్ హోమ్ బేనర్ అనదగ్గ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బుధవారం సాయంత్రం ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ కాంబినేషన్లో సినిమా అని మాత్రమే వెల్లడించే అవకాశముంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందే అంచనాలు తార స్థాయికి చేరబోతున్నాయి.

కాంబినేషన్ క్రేజ్.. ఈ సినిమా తెరకెక్కబోయే టైమింగ్ కారణంగా ‘అరవింద సమేత’తో పోలిస్తే బడ్జెట్ మాత్రమే కాదు.. బిజినెస్ కూడా దీనికి రెట్టింపు స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’తో త్రివిక్రమ్ ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు.

మరోవైపు తారక్.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రం తర్వాత నటించబోయే సినిమా ఇది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్, మార్కెట్ అన్నీ మారిపోయి ఉంటాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా టాప్ ఫాంలోకి వెళ్లబోయే సమయంలో కలిసి సినిమా చేస్తున్నారు. దీంతో ఈ సినిమా రేంజ్ మరోలా ఉండబోతోంది. ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అంతకుమించి బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి నిర్మాతల పంట పండినట్లే. ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కూడా వాటాల రూపంలో భారీగానే ఆదాయం అందుకునే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English