ఏడాదిన్నరలో 100 నుంచి 15కి..

ఏడాదిన్నరలో 100 నుంచి 15కి..

ఎంత వేగంగా పైకి ఎదిగాడో.. అంతే వేగంగా కింద పడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఏడాదిన్నర కిందట అతడి నుంచి వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా రూ.70 కోట్ల దాకా షేర్ రాబట్టింది. కానీ ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పరిస్థితి చూస్తుంటే అందులో 15 శాతం షేర్‌కు పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.

ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండగా.. విజయ్ క్రేజ్ వల్ల తొలి రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినట్లు కనిపించింది. కానీ సినిమాకు బ్యాడ్ టాక్ రావడంతో తొలి రోజు సాయంత్రానికే వసూళ్లు పడిపోయాయి. వీకెండ్లో ఓ మోస్తరుగా ఆడిన సినిమా.. ఆ తర్వాత అసలు నిలబడలేకపోయింది. థియేటర్లు జనాలు లేక వెలవెలబోయాయి.

మొత్తంగా చూస్తే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ షేర్ రూ.10 కోట్ల మార్కును కూడా టచ్ చేసిందా లేదా అన్నది సందేహంగానే ఉంది. చిత్ర బృందం సినిమాను ప్రమోట్ చేయడమే మానేసింది. బయ్యర్లు కూడా సినిమాపై ఆశలు వదులుకున్నారు. సోమవారం నుంచి షేర్ నామమాత్రంగా వస్తుండటంతో బాక్సాఫీస్ వెబ్ సైట్లు, ట్రేడ్ అనలిస్టులు కూడా సినిమాను లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది.

ఏడాది ముందు వరకు బంపర్ క్రేజ్‌తో ఉన్న విజయ్.. ఇంతలోనే ఇలా డీలా పడిపోతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఫాంలో లేని క్రాంతి మాధవ్‌తో ఇచ్చిన మాట కోసం సినిమా చేయడం విజయ్ కొంప ముంచిందనే చెప్పాలి. మొత్తానికి వచ్చిన క్రేజ్‌ను ఇప్పటికే చాలా దెబ్బ తీసుకున్నాడు విజయ్. ఇక అతడి ఆశలన్నీ పూరి జగన్నాథ్ సినిమా మీదే ఉన్నాయి. ఐతే ‘ఇస్మార్ట్ శంకర్’తో ఫ్లూక్ హిట్ కొట్టేశాడని కౌంటర్లు వేయించుకున్న పూరి.. విజయ్‌కు ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English