బ‌న్నీ-సుక్కు.. ఎంత‌కీ తెగ‌దే

బ‌న్నీ-సుక్కు.. ఎంత‌కీ తెగ‌దే

ఇంకో 40 రోజులు ఆగితే రంగ‌స్థ‌లం రిలీజై రెండేళ్లు పూర్త‌వుతుంది. ఈ సినిమాతో కెరీర్లో అతి పెద్ద విజ‌యాన్నందుకున్న సుకుమార్‌పై అంచ‌నాలు ఏ స్థాయికి చేరాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌రి ఆ అంచ‌నాల్ని సుక్కు ఏ మేర అందుకుంటాడో చూద్దామ‌ని ఎదురు చూస్తూనే ఉన్నారు అభిమానులు. కానీ ఇప్ప‌టిదాకా ఆయ‌న త‌ర్వాతి సినిమా షూటింగ్ ద‌శ‌కు వెళ్ల‌లేదు.

చాలా మ‌లుపులు తిరిగి.. చాలా ఆల‌స్యంగా ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. త‌ర్వాతైనా రెగ్యుల‌ర్ షూటింగ్‌కు వెళ్తుంద‌నుకుంటే అదీ జ‌ర‌గ‌లేదు. రెండు నెల‌ల కింద‌ట కేర‌ళ‌కు వెళ్లి ఒక ట్ర‌య‌ల్ షూట్ చేసుకురావ‌డం మిన‌హా ఏ ప్రోగ్రెస్ లేదు. హీరో అస‌లు రంగంలోకే దిగ‌లేదు.

అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ్‌కు ముందే బ‌న్నీ ఫ్రీ అయ్యాడు. మ‌ధ్య‌లో ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీ అనుకున్నా.. త‌ర్వాత కూడా బన్నీలో కదలిక లేదు. సుకుమార్ సినిమాను మొదలుపెట్టలేదు. సంక్రాంతి తర్వాతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారం అన్నారు. ఇప్పుడు చూస్తే ఫిబ్రవరి కూడా పూర్తి కావస్తోంది. మార్చి ప్రథమార్ధంలో కూడా బన్నీ-సుక్కు సినిమా షూటింగ్ జరగదన్నది తాజా సమాచారం.

ప్రస్తుతానికి మార్చి నెలాఖరుకి ఎలాగైనా షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. దాదాపు రెండు నెలల పాటు కేరళ అడవుల్లో కీలక దృశ్యాలు తెరకెక్కించాల్సి ఉండగా.. వేసవి దాటిందంటే వర్షాల వల్ల అక్కడ షూటింగ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకో నెల రోజుల్లో చిత్ర బృందం అక్కడికెళ్లి పని మొదలుపెట్టాల్సిందే. మరి అడ్డంకులన్నీ తొలగి మార్చి నెలాఖరుకైనా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English