నాని ప్ల‌స్స‌వుతాడా.. మైన‌స్ అవుతాడా?

నాని ప్ల‌స్స‌వుతాడా.. మైన‌స్ అవుతాడా?

సినిమా సినిమాకూ ఆశ్చ‌ర్య‌ప‌రిచే న‌టుడు నాని. ఒక సినిమా చూసి ఇదే అత‌డి బెస్ట్ పెర్ఫామెన్స్ అనుకుంటే.. త‌ర్వాతి సినిమాతో ఇంకా బాగా న‌టించి ముందున్న అభిప్రాయం మార్చుకునేలా చేస్తుంటాడు. ఇలా ఎన్నో సినిమాల‌తో అత‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అత‌ను న‌టుడిగా విఫ‌ల‌మైన సినిమాలు, పాత్ర‌లు చాలా అరుదు. కృష్ణార్జున యుద్ధంలో రాక్ స్టార్ లాంటి ఒక‌ట్రెండు పాత్ర‌ల్లో మాత్ర‌మే అత‌ను మిస్ ఫిట్‌గా అనిపించాడు.

పాత్ర ఎలాంటిదైనా దాని కోసం అత‌ను త‌న‌ను తాను మౌల్డ్ చేసుకునే తీరే నానిని భిన్నంగా నిల‌బెడుతుంది. ఇంత‌కుముందు జెంటిల్‌మ్యాన్‌లో నాని కొంచెం నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర చేశాడు. మెప్పించాడు. ఐతే అలా కాకుండా ఇప్పుడ‌త‌ను పూర్తి స్థాయిలో నెగెటివ్ క్యారెక్ట‌ర్ చేస్తున్న సినిమా.. వి.

తాజాగా రిలీజైన టీజ‌ర్ చూస్తే నాని పాత్ర షాకింగ్‌గానే ఉండ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అత‌ను చేస్తున్న‌ది సైకో కిల్ల‌ర్ పాత్ర‌లా ఉంది. ప‌క్కాగా ప్లాన్ చేసి క్రూరంగా మ‌నుషుల్ని చంపే పాత్ర‌లో నాని క‌నిపించ‌నున్నాడు. మామూలుగా ఇలాంటి సినిమాల టీజ‌ర్లు చూస్తేనే భ‌యం పుట్టాలి. తెర మీద‌ కూడా ఆ భ‌య‌మే సినిమాను న‌డిపించాలి. ఐతే ఈ సినిమా చూస్తున్న‌పుడు ఆ ఫీలింగ్ క‌లుగుతుందా అన్న‌ది సందేహ‌మే. నాని మీద జ‌నాల్లో ఉన్న టూమ‌చ్ పాజిటివిటీ ఈ పాత్ర‌ను పండించే విష‌యంలో ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తోంది.

టీజ‌ర్ చివ‌ర్లో నాని మాడ్యులేష‌న్ మార్చి త‌న వాయిస్‌లో విల‌న్ ఛాయ‌లు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశాడు కానీ.. అదంతంగా వ‌ర్క‌వుట్ కాలేదు. చాలా వ‌ర‌కు ల‌వ‌బుల్ క్యారెక్ట‌ర్లు చేయ‌డం, జ‌నాల్లో అత‌డి ప‌ట్ల పాజిటివ్ ఇమేజ్ ఉండ‌టం వ‌ల్ల నెగెటివ్ క్యారెక్ట‌ర్ అంటే దాని ప‌ట్ల ఆ ఫీల్ రావ‌ట్లేదు. టీజ‌ర్ చూసిన‌పుడు క‌లిగిన ఇబ్బంది ఇది. మ‌రి సినిమా చూస్తున్న‌పుడు ఈ ఫీలింగ్ ఏమైనా మారుతుందేమో చూడాలి. ఈ విష‌యంలో తేడా వ‌స్తే నాని ఆ పాత్ర చేయ‌డం మైన‌స్ అయినా కావ‌చ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English