అరెరే బాలయ్యలో ఎంత మార్పు?

అరెరే బాలయ్యలో ఎంత మార్పు?

బాలకృష్ణకి ఇటీవల అనుకున్న ఫలితాలు రావడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్ అవడంతోనే బాలయ్య డీలా పడ్డారు. రులర్ చిత్రానికి కనీస వసూళ్లు రాకపోవడంతో తన మార్కెట్ డౌన్ అయిందని బాలయ్య గ్రహించారు. గతంలో కథ కోసం వేచి చూడడానికి ససేమీరా అనేసే బాలయ్య ఇప్పుడు కథ కోసమని వేచి చూస్తున్నారు. బోయపాటి శ్రీను పూర్తిగా సిద్ధం అయి వచ్చే వరకు మరో సినిమా మొదలు పెట్టే ఆలోచన చేయడం లేదు. పడిపోయిన బాలయ్య మార్కెట్ తో బడ్జెట్ తగ్గించాలని నిర్మాత పట్టుబడితే పంతం పట్టకుండా నిర్మాత శ్రేయస్సు ఆలోచించి ఖర్చు తగ్గిస్తున్న ఓకే అంటున్నారు.

బోయపాటి ఎప్పుడు రెడీ అంటే అప్పుడు షూటింగ్ మొదలు పెట్టడానికి బాలయ్య ఓపిగ్గా చూస్తున్నారు. గతంలో ఇదే బోయపాటి కథ కోసం నాలుగు నెలల సమయం అడిగితే మరో సినిమా మొదలు పెట్టేసారు. ఎంత భారీ చిత్రం అయినా కానీ ప్రిపరేషన్ కి టైం ఇవ్వడం బాలయ్య హిస్టరీలో లేదు. అలాంటిది ఇప్పుడు ఆయనలోని మార్పు చూసి ఔరా అంటున్నారందరూ. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టి దసరాకి విడుదల చేసేలా బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ దసరా మిస్ అయితే డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల ఖాయం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English