జాను దెబ్బకి సమంత గప్ చుప్ సాంబార్ బుడ్డి!

జాను దెబ్బకి సమంత గప్ చుప్ సాంబార్ బుడ్డి!

మజిలి అంత పెద్ద హిట్ అయితే ఆ విజయాన్ని సమంత ఖాతాలో వేసేసారు. ఓ బేబీతో సమంత మరో ఘన విజయం సాధిస్తే ఇక ఆమెకి తిరుగులేదని అనుకున్నారు. సమంత ఉంటె సినిమా ఆడేస్తుంది అనే నమ్మకంతో దిల్ రాజు జాను చిత్రానికి ఆమెకి రెండు కోట్ల పారితోషికం ఇచ్చి మరీ పెట్టుకున్నాడు. అయితే సమంత ఉన్నా కానీ జాను చూడ్డానికి జనం కదిలి రాలేదు. సమంత ఆడించేస్తుందనే మాటలు వినీ వినీ శర్వానంద్ కూడా జాను కి ప్రమోషన్స్ చేయడానికి అంత ఆసక్తి చూపించలేదు.

జాను అంత పెద్ద ప్లాప్ అవడంతో సమంతతో పాటు మిగతా అందరికి రియాలిటీ తెలిసి వచ్చింది. కథ బలం ఉంటె సినిమాలు ఆడతాయి తప్ప సమంత ఉంటే ఆడవని రుజువయింది. దీంతో జాను కి ముందు పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన సమంత ఇక ఆ చిత్రాలు చేయనని చెప్పేసింది. జాను లాంటి ప్లాప్ ఇంకోటి పడితే ఇక తనని ఈ రేంజ్ సినిమాలకు కూడా పక్కన పెట్టేస్తారని సమంతకి తెలుసు. అందుకే అలంటి పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడుతోంది. అనుమానం ఉన్న కథలను రిజెక్ట్ చేసి నిజంగా దమ్మున్న కథ అయితేనే చేద్దామని నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు సమంత కోసం ఎదురు చూసిన దర్శకులు ఇప్పుడు ఆమె డేట్స్ దొరకవని తెలిసి నీరుగారిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English