డైరెక్టర్ ని తిట్టుకున్నారు కానీ పది కోట్లు మిగిలింది

డైరెక్టర్ ని తిట్టుకున్నారు కానీ పది కోట్లు మిగిలింది

చలో దర్శకుడు వెంకీ కుడుముల తాజా చిత్రం భీష్మకి హిట్టు కళ కనిపిస్తోంది. ట్రైలర్ కూడా నీట్ గా, సినిమా చూడాలనిపించేలా ఉంది. మొదటి సినిమాతోనే సత్తా చాటుకున్న ఈ త్రివిక్రమ్ శిష్యుడు ఇప్పుడు రెండో చిత్రంతో నమ్మదగ్గ దర్శకుడు అనిపించుకుంటున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ విజయం కూడా వరిస్తే వెంకీ బిజీ అయిపోతాడు. మొదటి సినిమాని పది కోట్ల లోపు బడ్జెట్ లో తీసిన వెంకీ భీష్మ కి మాత్రం పాతిక కోట్ల వరకు ఖర్చు పెట్టించాడట. అందుకని ఈ చిత్ర నిర్మాతలు అతడిని తిట్టుకున్నారు. అప్పట్లో అతని గురించి కొన్ని వెబ్సైట్స్ లో వదంతులు కూడా రాసారు.

భీష్మ చిత్రానికి వచ్చేసరికి నితిన్ వరసగా మూడు ప్లాప్స్ తో ఉన్నాడు. అందుకే ఖర్చు పెట్టడానికి భయపడ్డారు. కానీ ఈ సినిమా విడుదలకి ముందే పది కోట్ల లాభం వెనకేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ గత చిత్రం రణరంగం ప్లాప్ అయి భారీ నష్టాలు తెచ్చింది. ఆ నష్టాన్ని భీష్మ భర్తీ చేస్తోంది. వెంకీ కుడుములకి ఈ చిత్రం విషయంలో బ్యాడ్ పీ ఆర్ వచ్చినా కానీ అతనికి మైత్రి మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్స్ లభించింది. మొదటి సినిమా శౌర్యతో చేసిన వెంకీ రెండో సినిమాకి నితిన్ కి ఎదిగాడు. ఇదీ హిట్ అయితే ఇంకా పెద్ద హీరోకి ఎదగాలని చూస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English