అందరినీ కకావికలం చేసిన రాజమౌళి!

అందరినీ కకావికలం చేసిన రాజమౌళి!

రాజమౌళి తన మల్టీ స్టారర్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి ప్రకటించడంతో చాలా చిత్రాల ప్రణాళికలు మారిపోయాయి. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న చిత్రాలని వచ్చే వేసవికి వాయిదా వేసేసుకున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి కారణంగా మరిన్ని సమస్యలు చాలామందికి వచ్చి పడ్డాయి. చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో చరణ్ నటించడం వాళ్ళ దానిని ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయితే కానీ విడుదల చేసే అవకాశం లేదు. అలా చిరంజీవి, కొరటాల శివ ఇద్దరు లాక్ అయిపోయారు.

త్రివిక్రమ్ తో తారక్ సినిమా ఓకే అయినా కానీ అది ఎప్పుడు మొదలు పెట్టుకోవచ్చనే దానిపై వారికీ ఐడియా లేదు. రాజమౌళి ఎప్పుడు షూటింగ్ పూర్తయింది అని చెపితే అప్పుడు ఆ చిత్రం మొదలవుతుంది. చరణ్ తదుపరి చిత్రం కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటోంది. ఒకవేళ తదుపరి చిత్రానికి డేట్స్ ఇవ్వాలంటే ఎప్పట్నించి ఇవ్వాలనేది చరణ్ కి తెలీదు. తన హీరోలు మాత్రమే కాకుండా పలువురు హీరోలు, దర్శకులు కూడా రాజమౌళి సినిమా వల్ల తమ ప్లాన్స్ మార్చుకున్నారు. రాజమౌళికి తన సినిమా ఎప్పుడైనా విడుదల చేసుకునే సౌలభ్యం ఉంది.

ఎప్పుడు వచ్చినా కానీ తన కలెక్షన్స్ తనకు వచ్చేస్తాయి. పోటీ గురించి భయపడాల్సిన పని లేదు. అలాగే అతనితో పని చేసే హీరోలు కూడా తనని తొందర పెట్టె ధైర్యం చేయరు. దీనివల్ల రాజమౌళి ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ అందుకు తగ్గట్టు అందరు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ సంక్రాంతికి రాజమౌళి సినిమా రాలేకపోతే వెంటనే తమ సినిమా విడుదల చేసుకునేలా కూడా నిర్మాతలు సిద్ధంగా ఉండాలి. ఇది పలువురి ప్రణాళికలని తీవ్రంగా డిస్టర్బ్ చేస్తోంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English