ప్లేబాయ్ హీరో వలలో కొత్త పిల్ల!

ప్లేబాయ్ హీరో వలలో కొత్త పిల్ల!

తమిళ నటుడు, టి. రాజేందర్ కొడుకు శింబుకి తమిళ చిత్ర సీమలో ప్లేబాయ్ అనే పేరుంది. తమిళ చిత్ర సీమని ఒక ఊపు ఊపిన హీరోయిన్లు ఇతగాడి ప్రేమలో మునిగి తేలారు. నయనతార ముందుగా శింబు ప్రేమలోనే పడింది. పెళ్లి కూడా చేసేసుకుందాం అనుకుంది. అతనితో తన ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యే లెవెల్ కి నయనతార చాలా దూరం వెళ్ళింది.

నయనతార గురించి అంతా తెలిసినా కానీ హన్సిక కూడా శింబుని ప్రేమించింది. ఆమెతో పెళ్లి ఖాయం అనే అనుకున్నారు కానీ ఆమె కూడా అతనికి హ్యాండ్ ఇచ్చేసింది. తర్వాత అఫైర్స్ కి దూరంగా ఉంటోన్న శింబు మళ్లి ఇప్పుడు ఒక యువ హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటున్నాడని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. సుభిక్ష అనే ఆ హీరోయిన్ తో శింబు చెట్టపట్టాలు వేసుకుని తిరగడం కెమెరాలకు చిక్కింది. అయితే శింబు ఎప్పటిలా ఈ వార్తల గురించి సైలెంట్ గా ఉన్నాడు.

సుభిక్ష మాత్రం శింబు తనకి స్నేహితుడు మాత్రమేనని, ఎక్కువ ఊహించుకోవద్దని మీడియాకి చెబుతోంది. అయితే శింబుతో ప్రేమలో ఉన్న రోజుల్లో నయనతార, హన్సిక కూడా ఇలాగె బొంకేవారు. అందుకే సుభిక్ష ఎంత ఖండించినా కానీ వీరిద్దరి గురించిన రాతలైతే మోత మోగిపోతున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English