దిల్ రాజు లెక్క మళ్ళీ తప్పింది!

దిల్ రాజు లెక్క మళ్ళీ తప్పింది!

దిల్ రాజుకి ఏ కథని అయినా జడ్జ్ చేసే కెపాసిటీ ఎక్కువ అని ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు. దిల్ రాజు ఏదైనా సినిమా బాగా ఆడుతుందని నమ్మితే అది జరిగి తీరేది. అందుకే వేరే సినిమాలకి కూడా దిల్ రాజు సలహాలు తీసుకుని అతను చెప్పిన మార్పు చేర్పులు చేసే వాళ్ళు. కానీ ఇదంతా గతం.

ఇప్పుడు దిల్ రాజు గట్ ఫీలింగ్ పలు మార్లు రాంగ్ అవుతోంది. వేరే వాళ్ళ సినిమాలపై అతని తీర్పు మాత్రమే కాకుండా తాను తీసే చిత్రాలకి కూడా దిల్ రాజు జడ్జ్ మెంట్ గతి తప్పుతోంది. 96 రీమేక్ వద్దని దిల్ రాజుని పలువురు వారించారు. నాని అయితే ఈ చిత్రం వర్కౌట్ కాదని చెప్పి చేయననేసాడు. శర్వానంద్, సమంత కూడా ఇది రీమేక్ చేయడం కరెక్ట్ కాదనే చెప్పారు. కానీ తనను నమ్మమని దిల్ రాజు వారికి నచ్చజెప్పి బలవంతంగా సినిమా తీసాడు. కానీ అందరు భయపడినట్టే జాను ఇక్కడ వర్కౌట్ కాలేదు.

ఇంతకు ముందు శ్రీనివాస కళ్యాణం చిత్రానికి కూడా దిల్ రాజు ఇలాగే చేసాడు. ఆ సినిమా ప్లాప్ అని మొదటి రెండు రోజుల్లో తేలిపోయినా కానీ అది పికప్ అవుతుందని అనుకున్నాడు. అలాగే ప్రతి రోజు పండగే కథ మారుతీ తనకే చెపితే ఇది శతమానం భవతి 2 అంటారని, ఫెయిల్ అవుతుందని రిజెక్ట్ చేసాడు. తీరా ఆ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతలకి రూపాయికి రూపాయి లాభం వచ్చింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English