రామ్ చ‌ర‌ణ్‌.. మ‌రో మ‌ల‌యాళ రీమేక్

రామ్ చ‌ర‌ణ్‌.. మ‌రో మ‌ల‌యాళ రీమేక్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు ఉన్న‌ట్లుండి మ‌ల‌యాళ సినిమాలపై మ‌న‌సు మ‌ళ్లిన‌ట్లుంది. ఇప్ప‌టికే మోహ‌న్ లాల్ సినిమా లూసిఫ‌ర్ రీమేక్ హ‌క్కులు తీసుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. దాన్ని త‌న తండ్రి చిరంజీవితో రీమేక్ చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ఆ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో.. దాన్ని ఎవ‌రు తెర‌కెక్కిస్తారో తెలియ‌దు. మ‌ధ్య‌లో సుకుమార్ పేరు వినిపించింది కానీ.. అలాంటి ద‌ర్శ‌కుడు రీమేక్ తీస్తాడా అన్న సందేహాలు నెల‌కొన్నాయి.

అస‌లు లూసిఫ‌ర్ లాంటి రొటీన్ సినిమా, పైగా తెలుగులోకి కూడా అనువాద‌మైన చిత్రాన్ని మ‌ళ్లీ రీమేక్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌న్న అభిప్రాయం ఉంది. ఐతే ఈ సినిమా సంగ‌తి తేల‌కుండానే రామ్ చ‌ర‌ణ్.. రీమేక్ కోసం మ‌రో మ‌ల‌యాళ సినిమాపై క‌ర్చీఫ్ వేశాడ‌ని వార్త‌లొస్తుండ‌టం విశేషం.

లూసిఫ‌ర్ సినిమాను డైరెక్ట్ చేసిన స్టార్ హీరో పృథ్వీరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా హ‌క్కులను చ‌ర‌ణ్ కొన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమా హ‌క్కులు తీసుకుంది ఎవ‌రి కోస‌మ‌న్న‌ది తెలియ‌డం లేదు. చ‌ర‌ణ్‌కు కానీ, చిరుకు కానీ సూట‌య్యే స‌బ్జెక్ట్ కాదిది. వాళ్లే కాదు.. బ‌డా స్టార్లెవ‌రూ చేయ‌డానికి బాగుండ‌దు. ఇందులో పెద్ద‌గా హీరోయిజం ఉండ‌దు.

ఐతే మీడియం రేంజ్ హీరో ఎవ‌రైనా న‌టిస్తే బాగుంటుంది. మెగా ఫ్యామిలీ సంగ‌తే తీసుకుంటే వ‌రుణ్ తేజ్ దీనికి ప‌ర్ఫెక్ట్ అనిపిస్తాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ అయినా ఓకే. ఇప్ప‌టిదాకా సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌లో తండ్రితో మాత్ర‌మే సినిమాలు తీస్తున్న చ‌ర‌ణ్‌.. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్‌ను వేరే హీరోతో ప‌ట్టాలెక్కిస్తాడేమో చూడాలి. త్వ‌ర‌లోనే దీనిపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English