ఎక్స్‌క్లూజివ్: ప‌వ‌న్‌కు క‌థ చెబుతున్న త్రివిక్ర‌మ్

ఎక్స్‌క్లూజివ్: ప‌వ‌న్‌కు క‌థ చెబుతున్న త్రివిక్ర‌మ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఎంతోమంది ద‌ర్శ‌కులు ప‌ని చేశారు. కానీ ఇంకెవ్వ‌రూ త్రివిక్ర‌మ్‌లా అత‌డికి ఆప్త‌మిత్రుడు కాలేక‌పోయారు. జ‌ల్సాతో మొద‌లైన వీరి ప్ర‌యాణం ఆ త‌ర్వాత సినిమాను దాటి వ్య‌క్తిగ‌త స్థాయికి చేరుకుంది. తొలి క‌ల‌యిక‌లో మంచి విజ‌య‌మే అందుకున్న ఈ జోడీ.. రెండోసారి జ‌త క‌ట్టి అత్తారింటికి దారేది లాంటి ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చింది.

ఐతే అజ్నాత‌వాసితో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తే దారుణ‌మైన ఫ‌లితం వ‌చ్చింది. అద‌వ్వ‌గానే ప‌వ‌న్ రాజ‌కీయాల వైపు వెళ్లిపోయాడు. త్రివిక్ర‌మ్ వ‌రుస‌గా ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల‌తో సినిమాలు చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో రెండో సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఐతే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ముందు ప‌వ‌న్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం వ‌స్తుండ‌టం విశేషం.

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో నాలుగో సినిమా గురించి ఇప్ప‌టిదాకా ఎక్క‌డా చిన్న క‌బురు కూడా బ‌య‌టికి రాలేదు. ఈ కాంబినేష‌న్ గురించి అస‌లు చ‌ర్చే లేదు. కానీ చ‌డీచ‌ప్పుడు లేకుండా త్రివిక్ర‌మ్‌.. ప‌వ‌న్‌ను క‌లిసి క‌థ చెబుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ సినిమాకు నిర్మాత ఎవ‌రు.. వీళ్ల క‌ల‌యిక‌లో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది అన్న వివ‌రాలేవీ బ‌య‌టికి రాలేదు. కానీ ప‌వ‌న్‌కు త్రివిక్ర‌మ్ క‌థ చెబుతున్న మాట మాత్రం వాస్త‌వం అన్న‌ది ప‌వ‌న్ టీం నుంచి వ‌స్తున్న స‌మాచారం.

బ‌హుశా ఆర్ఆర్ఆర్ ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ అనుకున్న స‌మ‌యానికి అందుబాటులోకి రాలేక‌పోతుండొచ్చు. ఈ లోపు ప‌వ‌న్‌తో సినిమా చేసే ప్ర‌య‌త్నంలో త్రివిక్ర‌మ్ ఉండొచ్చు. ప్ర‌స్తుతం పింక్ రీమేక్‌తో పాటు క్రిష్ సినిమాను కూడా స‌మాంత‌రంగా చేస్తున్నాడు ప‌వ‌న్. దాని త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ సినిమా కూడా లైన్లో ఉంది. మ‌రి త్రివిక్ర‌మ్‌తో సినిమాను ఎప్పుడు ప‌ట్టాలెక్కిస్తాడో?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English