పవన్‌కు హిట్టిస్తే చిరుతో ఛాన్స్

పవన్‌కు హిట్టిస్తే చిరుతో ఛాన్స్

హరీష్ శంకర్‌కు పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేయాలని ఆశ. కానీ నిలకడగా హిట్లు ఇవ్వకపోవడంతో అతడి మీద స్టార్ హీరోల్లో గురి కుదరట్లేదు. ‘గబ్బర్ సింగ్’ మినహాయిస్తే బడా స్టార్లతో అతను చేసిన సినిమాలు ఆడలేదు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’ డిజాస్టర్ కాగా.. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్‌తో తీసిన ‘దువ్వాడ జగన్నాథం’ అంచనాల్ని అందుకోలేకపోయింది.

ఐతే ఒక ఫ్లాప్ తర్వాత కసితో పని చేసి హిట్టు కొట్టే అలవాటున్న హరీష్.. ‘వాల్మీకి’తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ హీరోగా హరీష్ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

తన కెరీర్‌కు అత్యంత కీలకమైన ఈ సినిమా కోసం హరీష్ చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. పవన్‌కు మరోసారి హిట్టిస్తే తన కెరీర్ మరో స్థాయికి చేరుతుందని.. తర్వాత వరుసగా పెద్ద హీరోలతోనే సినిమాలు చేయొచ్చని హరీష్ భావిస్తున్నాడు. ఈ సినిమా ఆడితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం హరీష్‌కు దక్కే అవకాశముందట. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సమయంలోనే హరీష్‌తో పని చేయడం తనకు ఇష్టమే అన్న సంకేతాలిచ్చాడు చిరు. ‘గబ్బర్ సింగ్’ చూసి ఇలాంటి సినిమా తనకు పడితే బాగుండేదని అన్నాడు.

హరీష్ కథతో ఇంప్రెస్ చేస్తే అతడితో సినిమా చేస్తానని ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ఆడియో వేడుకలో చెప్పాడు. ఇప్పుడు ఈ దిశగా మరోసారి సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. హరీష్ కూడా చిరును టార్గెట్ చేశాడని.. పవన్ సినిమాతో హిట్ ఇచ్చి చిరును కలవాలనుకుంటున్నాడని.. కచ్చితంగా ఈ కాంబినేషన్ వర్కవుట్ కావచ్చని మెగా కాంపౌండ్ వర్గాలంటున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English