ఈ సినిమా డిజాస్టర్ కా బాప్

ఈ సినిమా డిజాస్టర్ కా బాప్

అనుకున్నదే అయింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన బాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘లవ్ ఆజ్ కల్-2’ ఏమాత్రం ఆడే అవకాశాలు లేవని తేలిపోయింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కాబోతోందని తొలి రోజే స్పష్టం అయిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే ఇది ఆడే అవకాశాలు లేవని తేల్చేశారు జనాలు.

దీనికి తోడు విడుదలకు ముందు బాలీవుడ్ సెలబ్రెటీలు, ప్రెస్ వాళ్లకు ప్రివ్యూ వేయగా.. మొహమాటానికి కూడా ఎవరూ సినిమా బాగుందని చెప్పలేదు. కొందరు క్రిటిక్స్ సినిమా చాలా దారుణంగా ఉందని.. డిజాస్టర్ కావడం ఖాయమని ముందే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక శుక్రవారం సినిమా విడుదల తర్వాత టాక్ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రేమికుల దినోత్సవం రోజు ఒక ప్రేమకథ చూద్దామని వెళ్లిన ప్రేక్షకులకు చేదు అనుభవం ఎదురైంది.

వేలంటైన్స్ డే నాడు తమ విలువైన సమయం వృథా అయిందన్న ఆక్రోశాన్ని యూత్ వ్యక్తం చేస్తున్నారు. సినిమా మీద అభిప్రాయం చెప్పమని మీడియా వాళ్లు మైకులు పెడితే.. తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తున్నారు. దర్శకుడు ఇంతియాజ్ అలీని చెడామడా తిట్టేస్తున్నారు. అతడికి అసలు బుర్ర పని చేస్తోందో.. ఏం సినిమా తీశాడు.. దీనికి తలా తోకా ఏమైనా ఉందా అంటున్నారు. ఇంతకుముందు ఇంతియాజ్ అలీ తీసిన ‘లవ్ ఆజ్ కల్’లో దీని సీక్వెల్ పదో శాతం కూడా లేదన్నది వాళ్ల మాట.

నిజ జీవితంలో ప్రేమ జంట అయిన ఆర్యన్ కార్తీక్, సారా అలీ ఖాన్ అసలేమాత్రం కెమిస్ట్రీ పండించలేకపోయారని అంటున్నారు. ‘లవ్ ఆజ్ కల్’ మాత్రమే కాదు.. ఇంతియాజ్ ఇంతకుముందు తీసిన సినిమాల్లో మంచి ఫీల్ ఉండేది. కానీ అతను ఈ మధ్య తన స్థాయికి మాత్రం తగని సినిమాలు అందిస్తున్నాడు. చివరగా షారుఖ్ ఖాన్ హీరోగా అతను తీసిన ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ సైతం పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English