బాల‌య్య న‌వ్వుల పాలైన సీన్‌.. బి.గోపాల్ ప‌శ్చాత్తాపం

బాల‌య్య న‌వ్వుల పాలైన సీన్‌.. బి.గోపాల్ ప‌శ్చాత్తాపం

ఫ్యాక్ష‌న్ సినిమాల్లో ఒక కొత్త ఒర‌వ‌డి తీసుకొస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఘ‌నుడు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు బి.గోపాల్. నంద‌మూరి బాల‌కృష్ణ‌కు స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు లాంటి ఆల్ టైం హిట్లు ఇచ్చాడాయ‌న‌. ఈ సినిమాల్ని బాల‌య్య‌, ఆయ‌న అభిమానులు అంత సులువుగా మ‌రిచిపోలేరు. ఐతే గోపాల్ వీటితో పాటు బాల‌య్య‌కు ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు అనే డిజాస్ట‌ర్ కూడా ఇచ్చాడు.

ఈ సినిమా ఆడ‌క‌పోవ‌డం పెద్ద విష‌యం కాదు కానీ.. అందులో బాల‌య్య చేసిన కొన్ని సీన్లు న‌వ్వుల పాల‌య్యాయి. తొడ కొడితే కుర్చీ త‌న ద‌గ్గ‌రికి రావ‌డ‌మే టూమచ్ అంటే.. ఏకంగా రైలు వెన‌క్కి వెళ్లిపోవ‌డం విడ్డూరం. అలాగ‌ని ఇదేమైనా ఫాంట‌సీ మూవీనా అంటే అదేమీ కాదు. మామూలు ఫ్యాక్ష‌న్-యాక్ష‌న్‌ మూవీ. ఈ స‌న్నివేశం వ‌ల్ల బాల‌య్య ఎంత కామెడీ అయిపోయాడో.. ఆయ‌న‌పై ఎన్ని జోకులు పేలాయో.. ఎంత ట్రోలింగ్ జ‌రిగిందో తెలిసిందే.

ఐతే ప‌ల‌నాటి బ్ర‌హ్మాన‌యుడు సినిమా వచ్చిన ద‌శాబ్దంన్న‌ర త‌ర్వాత బి.గోపాల్.. పై స‌న్నివేశాల విష‌యంలో ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశాడు. ముఖ్యంగా తొడ కొడితే రైలు వెన‌క్కెళ్లిపోయే సీన్ బాల‌య్య‌తో చేయించాల్సింది కాద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో అన్నాడు గోపాల్. ``పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. ఆ సినిమాలో కొన్ని సీన్లు విమర్శలపాలయ్యాయి. ముఖ్యంగా బాలయ్య తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ సినిమాలో పెట్టకుండా ఉండాల్సింది. ఆ సీన్ గురించి ఇప్పటికీ నేను బాధపడుతుంటాను. ఆ సీన్ పెట్టి చాలా తప్పు చేశాననే ఫీలింగ్ నాకుంది`` అని గోపాల్ అన్నారు.

ఇంద్ర వ‌ర‌కు అగ్ర ద‌ర్శ‌కుడిగా ఉన్న గోపాల్.. ప‌ల‌నాటి బ్ర‌హ్మనాయుడుతో ఒక్క‌సారిగా కింద ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఆయ‌న పుంజుకోలేక‌పోయారు. చివ‌ర‌గా గోపాల్ గోపీచంద్‌తో ఆర‌డుగుల బుల్లెట్టు అనే సినిమా తీయ‌గా.. అది విడుద‌ల‌కే నోచుకోలేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English