బిగ్ డే: ఆశలన్నీ అతడి మీదే

బిగ్ డే: ఆశలన్నీ అతడి మీదే

ఒక సినిమా ఆశలన్నీ హీరో మీదే నిలిచే సందర్భాలు అరుదుగా వస్తుంటాయి. శుక్రవారం రిలీజవుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ కోవకు చెందే సినిమానే. ఈ సినిమాను ముంచినా తేల్చినా విజయ్ దేవరకొండ చేతుల్లోనే ఉంది. ‘ఉంగరాల రాంబాబు’ లాంటి డిజాస్టర్ తీసిన దర్శకుడు క్రాంతి మాధవ్, ఎప్పుడు హిట్టు సినిమా తీశాడో తెలియని కె.ఎస్.రామారావు కలిసి చేసిన సినిమా ఇది.

ఎందుకోగానీ ఈ సినిమా మీద ముందు నుంచి జనాల్లో అంత సానుకూల అభిప్రాయం లేదు. పైగా విజయ్ నటించిన చివరి సినిమా ‘డియర్ కామ్రేడ్’ ఫ్లాప్ కావడం కూడా దీనికి ప్రతికూలంగా మారింది. ఈ సినిమా టైటిల్, ఇతర ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని అంతగా ఆకర్షించలేకపోయాయి. ఈ సినిమా పోవడం ఖాయం అనే ఫీలింగ్ ఒక దశలో జనాల్లో వచ్చేసింది. కానీ థియేట్రికల్ ట్రైలర్ వచ్చాక పరిస్థితి మారింది. ఒక విజయ్ క్రేజ్ కూడా కలిసొచ్చి ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాల్ని మించిపోయాయి.

ఐతే తొలి రోజు ఓపెనింగ్స్ సంగతెలా ఉన్నా సినిమా ఆ తర్వాత ఏ మేర నిలబడుతుందో చూడాలి. సినిమాకు టాక్ ఎలా వస్తుంది.. విజయ్ క్రేజుతో ఎన్నాళ్లు కలెక్షన్లు స్టడీగా ఉంటాయి అన్నది చూడాలి. ఈ సినిమా మరీ గొప్పగా ఉండదు, అలాగని చెత్తగా ఉండదు. మధ్యస్థంగా ఉండొచ్చన్న అంచనాతో ప్రేక్షకులున్నారు. బయ్యర్ల పెట్టుబడులు కొంచెం పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. నిర్మాత రామారావు కూడా కష్టాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ఆడటం చాలా చాలా అవసరం. దర్శకుడు క్రాంతి మాధవ్ కెరీర్‌కు కూడా ఈ సినిమా ఎంతో కీలకం.

తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కూడా ‘వరల్డ్ ఫేమస్ లవర్’పై చాలా ఆశలే పెట్టుకుంది. వీళ్లందరి ఆశల్ని ఈ సినిమా ఏ మేర నిలబెడుతుందో చూడాలి. గత వారం వచ్చిన ‘జాను’ వాషౌట్ అయిపోవడం, ముందు వారాల్లోని సినిమాలు కూడా నెమ్మదించడం ‘వరల్డ్ ఫేమస్ లవర్’కు కలిసొచ్చే అంశం. చూద్దాం ఈ అడ్వాంటేజీని సినిమా ఏ మేర ఉపయోగించుకుంటుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English