ఆ సినిమా చూసి గోవా వాళ్లు హర్ట్.. ఇక షూటింగలు వీజీ కాదు

ఆ సినిమా చూసి గోవా వాళ్లు హర్ట్.. ఇక షూటింగలు వీజీ కాదు

ఇండియాలో ఏ భాష‌లో సినిమా అయినా స‌రే.. బీచ్‌లో స‌న్నివేశాలు తీయాలి.. హీరో హీరోయిన్ల విహారం, రొమాన్స్ నేప‌థ్యంలో స‌న్నివేశాలు తీయాలి అంటే.. పార్టీయింగ్, క్యాజినోలు చూపించాలంటే గుర్తుకొచ్చేది గోవానే. ఇండియాలో బెస్ట్ టూరింగ్ ప్లేసుల్లో ఒక‌టైన గోవాలో షూటింగ్‌ల‌కు అనుమ‌తులు కూడా సులువుగానే ల‌భిస్తాయి. త‌క్కువ ఖ‌ర్చులో విదేశీ ట‌చ్ ఉండేలా స‌న్నివేశాలు తీసుకోవ‌డానికి ఇక్క‌డ వీలుండ‌టం వ‌ల్ల ఫిలిం మేక‌ర్స్ గోవాను ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేస్తారు.

ఐతే ఇలాంటి వాళ్ల‌కు ఏమాత్రం రుచించ‌ని విధంగా గోవా ప్ర‌భుత్వం స్టెప్ తీసుకుందిప్పుడు. ఇక‌పై గోవాలో సినిమా తీయాల‌నుకునేవాళ్లు త‌మ స్క్రిప్టును గోవా ప్ర‌భుత్వ అధికారుల‌కు స‌మ‌ర్పించాల‌ట‌. వాళ్లు దాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాకే అక్క‌డ షూటింగుకి అనుమ‌తి ఇస్తార‌ట‌.

ఉన్న‌ట్లుండి గోవా ప్ర‌భుత్వం ఇంత క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఈ మ‌ధ్య ఇండియ‌న్ మూవీస్‌లో గోవా అన‌గానే దాన్ని డ్ర‌గ్ సిటీగా చూపిస్తున్నార‌ట‌. డ్ర‌గ్స్, క్యాసినో, మ‌ద్యం, వ్య‌భిచారం లాంటి చెడు విష‌యాల‌కే గోవా ఫేమ‌స్ అన్న‌ట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నార‌ట‌.

ఇటీవ‌లే రిలీజైన మ‌లంగ్ సినిమాలో అయితే గోవాను మ‌రీ బ్యాడ్ లైట్‌లో చూపించ‌డం గోవా వాసుల‌ను హ‌ర్ట్ చేసింది. ఈ విష‌యం ప్ర‌భుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఇక‌పై గోవాలో జ‌రిగే సినిమా షూటింగుల‌పై దృష్టిసారించాల‌ని.. గోవాను చూపించే విష‌యంలో అభ్యంత‌రాలుంటే ఆయా సినిమాల‌కు త‌మ ద‌గ్గ‌ర షూటింగ్ చేసే అవ‌కాశం ఇవ్వొద్ద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిపై ఫిలిం మేక‌ర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English