పవన్‌ను వదిలేసి చిరు మీద పడ్డాడేంటి?

పవన్‌ను వదిలేసి చిరు మీద పడ్డాడేంటి?

యువ కథానాయకుడు నితిన్‌కు హీరోగా ఎంత గుర్తింపు ఉందో.. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగానూ అంతే గుర్తింపు ఉంది. పవన్‌పై తన అభిమానాన్ని మాటల్లో, చేతల్లో ఎన్నోసార్లు చూపించాడు నితిన్. మెగా హీరోల్ని మించి నితిన్ సినిమాల్లోనే పవన్ రెఫరెన్సులు కనిపిస్తుంటాయి. తనను సినిమాల వైపు నడిపించింది.. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా సినిమాల్ని విడిచిపెట్టకుండా కొనసాగేలా స్ఫూర్తినిస్తున్నది పవనే అని చెబుతుంటాడు నితిన్.

అంతలా పవన్ మీద అభిమానం చూపించే నితిన్.. ఈ మధ్య తన ఆరాధ్య హీరో రెఫరెన్సుల్ని పెద్దగా వాడట్లేదు. విశేషం ఏంటంటే.. తన కొత్త చిత్రం ‘భీష్మ’ కూడా అతను చిరు మీద ఫోకస్ పెట్టడం విశేషం. ఈ సినిమా నుంచి సింగిల్స్ యాంథెమ్ ఒకటి విడుదలవుతోంది. దానికి సంబంధించిన ప్రోమోలో నితిన్ వేసిన షర్టుకు చిరునే స్ఫూర్తి కావడం విశేషం.

నితిన్ షర్టు, అతడి లుక్ చూస్తే ఏదో రెట్రో లుక్ ట్రై చేస్తున్నాడన్న సంగతి అర్థమవుతోంది. ఆ రెట్రో లుక్‌కు స్ఫూర్తి చిరునే. మెగాస్టార్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘విజేత’ సినిమాలో ఒక వైపు రంగు రంగుల చారలతో ఉన్న చొక్కా ధరించాడు చిరు. అప్పట్లో ఆ చొక్కా సూపర్ పాపులరైంది. మరి ఈ చొక్కా గురించి ‘భీష్మ’ టీంలో ఎవరికి గుర్తొచ్చిందో ఏమో కానీ.. నితిన్ మూడు దశాబ్దాల కిందట ట్రెండ్ సెట్ చేసిన చొక్కాను ‘భీష్మ’ కోసం ధరించడం చర్చనీయాంశమైంది.

ఎప్పుడూ పవన్ రెఫరెన్సులతో వార్తల్లో నిలిచే నితిన్.. ఇలా చిరు మీద ఫోకస్ పెట్టడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది నెటిజన్లకు. ఇదిలా ఉంటే.. ‘భీష్మ’ మీద పాజిటివ్ బజ్ అంతకంతకూ పెరుగుతోంది. ‘ఛలో’ తర్వాత వెంకీ కుడుముల రూపొందించిన చిత్రమిది. దీన్నుంచి ఇప్పటిదాకా రిలీజైన పాటలకు మంచి స్పందనే వచ్చింది. ఈ నెల 21న ‘భీష్మ’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English