వావ్.. ప‌వ‌న్ కోసం సిద్ శ్రీరామ్

వావ్.. ప‌వ‌న్ కోసం సిద్ శ్రీరామ్

ఈ త‌రంలో మామూలు పాట‌ను కూడా త‌న గాత్ర మాధుర్యంతో ప్ర‌త్యేకంగా మార్చ‌గ‌ల నైపుణ్యం ఉన్న గాయ‌కుడు సిద్ శ్రీరామ్. అత‌డి స్వ‌రంలోని ప్ర‌త్యేక‌త వ‌ల్ల ఎన్నో పాట‌లు క్లాసిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ద‌క్షిణాదిన అత‌ణ్ని కొట్టే సింగ‌ర్ లేడు. ఆ మాట‌కొస్తే ఇండియా మొత్తంలోనూ టాప్ సింగ‌ర్ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు సిద్.

అత‌డి పాట‌లు ఉత్త‌రాదిన కూడా మార్మోగుతున్నాయి. సిద్ ఓ పాట‌ పాడాడంటే సినిమా ఏది.. హీరో ఎవ‌రు.. సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రు అని చూడ‌కుండా దానిపై ప్ర‌త్యేక ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు శ్రోత‌లు. ముందు చిన్న హీరోల‌కే పాట‌లు పాడిన అత‌ను.. ఇప్పుడు ఒక్కొక్క‌రుగా పెద్ద స్టార్ల‌ను క‌వ‌ర్ చేస్తున్నాడు.

ఇటీవ‌లే అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో బ‌న్నీ కోసం అత‌ను పాడిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ఎంత పెద్ద హిట్ట‌యిందో తెలిసిందే. బ‌న్నీకి అత‌డి వాయిస్ సెట్ అవుతుందా అని సందేహించారు కానీ.. పాట విన్నాక, తెర‌పై చూశాక‌ అలా ఏమీ అనిపించ‌లేదు. దీని త‌ర్వాత సిద్.. ప‌వ‌న్ కోసం త‌న గాత్రం ఇవ్వ‌బోతుండ‌టం విశేషం. త‌మ‌న్ మ‌రోసారి అత‌డితో పాట పాడిస్తున్నాడు. ఆ పాట పింక్ రీమేక్ మూవీ కోసం కావ‌డం విశేషం.

ఈ సినిమాలో సిద్‌తో పాట పాడిస్తున్న‌ట్లు త‌మ‌న్ అప్ డేట్ ఇచ్చాడు. దీంతో ఇటు ప‌వ‌న్, అటు సిద్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. సిద్ గాత్రంతో ప‌వ‌న్ పాట ఎలా ఉంటుందా అని చ‌ర్చించుకుంటున్నారు. ఈ పాట మామూలుగా ఉండ‌దంటూ దీని గేయ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి ట్వీట్ చేయ‌డం ద్వారా దీనిపై అంచ‌నాలు ఇంకా పెంచేయ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English