వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్.. అంత వీజీ కాదు

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్.. అంత వీజీ కాదు

విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్లో అత్యంత కీల‌క‌మైన సినిమా విడుద‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. డియ‌ర్ కామ్రేడ్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత అత‌ను చేసిన సినిమా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్. విజ‌య్ మాత్ర‌మే కాదు.. ఈ సినిమాకు ప‌ని చేసిన లీడ్ టీంలోని అంద‌రూ ఫ్లాపుల్లో ఉన్న‌వాళ్లే. ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్, నిర్మాత కె.ఎస్.రామారావుల ట్రాక్ రికార్డు కూడా ఏమంత బాగా లేదు. వీళ్లంద‌రికీ ఈ సినిమా హిట్ట‌వ‌డం చాలా కీల‌కం.

ఐతే ఈ సినిమాకు ముందు నుంచి ఆశించిన స్థాయిలో పాజిటివ్ బ‌జ్ లేదు. కానీ విజ‌య్ క్రేజు మీద సినిమా న‌డుస్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. ముందున్న నెగెటివిటీ అంతా ప‌క్క‌కు వెళ్లిపోయి ఈ సినిమాకు ఓ రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రుగుతుండ‌టం విశేషం. ఇది టాలీవుడ్ జ‌నాల్ని షాక్‌కు గురి చేస్తోంది.

ఐతే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ టార్గెట్ అయితే చిన్న‌ది కాదు. ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల్ని రూ.22 కోట్ల‌కు అమ్మారు. ఇంత‌కుముందు అయితే విజ‌య్‌కి ఇది చిన్న టార్గెటే. కానీ డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత అత‌డి మార్కెట్ దెబ్బతింది. సినిమాకు మంచి టాక్ రాక‌పోతే బ‌య్య‌ర్ల‌కు పంచ్ ప‌డ‌టం ఖాయం.

పాజిటివ్ టాక్ రావ‌డం, తొలి వారాంతంలో నిల‌క‌డ‌గా వ‌సూళ్లు సాధించ‌డం చాలా కీల‌కం. ఆ త‌ర్వాత కూడా సినిమా నిల‌బ‌డాలి. విజ‌య్ క్రేజుతో తొలి రోజు ఓపెనింగ్స్‌కు ఢోకా లేక‌పోవ‌చ్చు కానీ.. ఆ త‌ర్వాత వ‌సూళ్లు నిల‌క‌డ‌గా ఉండాలంటే సినిమాకు మంచి టాక్ రావ‌డం కీల‌కం. ఏదేమైనా ఈ సినిమా విజ‌య్ బాక్సాఫీస్ స‌త్తాకు పెద్ద ప‌రీక్ష‌గా నిల‌వ‌డం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English