ఒంటి చేత్తో లేపుతున్న దేవ‌ర‌కొండ‌

ఒంటి చేత్తో లేపుతున్న దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో ఉన్న‌ క్రేజ్ అంత సుల‌భంగా పోయేది కాద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు బాగా అర్థ‌మ‌వుతోంది. విజ‌య్ గ‌త సినిమా డియ‌ర్ కామ్రేడ్ డిజాస్ట‌ర్ కావ‌డం, దానికి తోడు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాపై ముందు నుంచి నెగెటివిటీ ఉండ‌టంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ పెద్ద‌గా ఉండ‌వ‌ని అనుకున్నారంతా. సోష‌ల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి అంద‌రూ నెగెటివ్‌గానే మాట్లాడుకున్నారు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా హైప్ క‌నిపించ‌లేదు.

కానీ క‌ట్ చేస్తే.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జ‌రుగుతున్నాయి. విజ‌య్ గ‌త సినిమాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని జోరు క‌నిపిస్తోంది. ఓపెనింగ్స్ కూడా అదే స్థాయిలో వ‌చ్చేలా ఉన్నాయి.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌కు సంబంధించి ఇంకే సానుకూలాంశాలు క‌నిపించ‌డం లేదు. కేవ‌లం విజ‌య్ మాత్ర‌మే జ‌నాల్ని థియేట‌ర్ల వైపు ఆక‌ర్షిస్తున్నాడు. వారం ముందు వ‌ర‌కు ప్ర‌మోష‌న్ల విష‌యంలోనూ ఈ సినిమా వెనుక‌బ‌డింది. కానీ ట్రైల‌ర్ లాంచ్ ద‌గ్గ‌ర్నుంచి ప‌రిస్థితి కొంత మారింది. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఉత్సాహం వ‌చ్చింది. అక్క‌డి నుంచి విజ‌య్ త‌న‌దైన శైలిలో సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నాడు.

బుధ‌వారం వైజాగ్‌లో ఈ సినిమాకు మ‌రో ప్రి రిలీజ్ ఈవెంట్ పెట్టారు. దానికి మామూలు చొక్కా, లుంగీ, త‌ల‌కు ట‌వ‌ల్‌తో అతి సామాన్య వ్య‌క్తిలాగా త‌యారై వ‌చ్చిన విజ‌య్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆల్రెడీ హాట్ టాపిక్ అయిపోయాయి. విజ‌య్ విజ‌యే అన్న కామెంట్లు ప‌డుతున్నాయి. మొత్తానికి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌ను విజ‌య్ పైకి లేపుతున్న తీరు అదుర్స్ అనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English