కోలీవుడ్లో తెలుగ‌మ్మాయి సెన్సేష‌న్‌

కోలీవుడ్లో తెలుగ‌మ్మాయి సెన్సేష‌న్‌

సుధ కొంగ‌ర‌.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ఈమె తెలుగ‌మ్మాయే అయినా.. త‌మిళంలో బాగా పాపుల‌ర్. మాధ‌వ‌న్‌తో ఇరుదు సుట్రు అనే స్పోర్ట్స్ డ్రామా తీసి సూప‌ర్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో సుధ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు కోలీవుడ్ ఫిదా అయిపోయింది. ఆ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేసి ఇక్క‌డా స‌క్సెస్ అయింది సుధ‌. అయినా ఇక్క‌డ ఆమెకు పెద్ద‌గా పేరు రాలేదు.

దీని త‌ర్వాత స్టార్ హీరో సూర్య.. సుధ‌కు ఛాన్స్ ఇవ్వ‌డం విశేషం. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో రానున్న ఆకాశ‌మే నీ హ‌ద్దురా నుంచి ఈ మ‌ధ్యే రిలీజైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్లాపుల‌తో అల్లాడుతున్న సూర్య‌.. ఈ సినిమాతో స‌క్సెస్ ట్రాక్ ఎక్కేలాగే క‌నిపిస్తున్నాడు.

ఈ సినిమాపై కోలీవుడ్లో పాజిటివ్ బ‌జ్ ఉండ‌గా.. అది రిలీజ్ కాక‌ముందే సుధ ఒక పెద్ద ప్రాజెక్టును ఖాతాలో వేసుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇప్పుడు కోలీవుడ్లో నంబ‌ర్ వ‌న్ హీరో అన‌ద‌గ్గ విజ‌య్‌తో సుధ సినిమా చేయ‌బోతోంద‌ట‌. ఇటీవ‌లే సుధ చెప్పిన క‌థ‌కు విజ‌య్ ఓకే చెప్పాడ‌ట‌. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో ఈ ఏడాది వేస‌విలో ఓ సినిమా మొద‌ల‌వుతుంద‌ని.. దాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ని కోలీవుడ్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

వ‌చ్చే సంక్రాంతికి రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్ త‌మిళంలో కూడా పెద్ద ఎత్తునే విడుద‌ల కానుండ‌గా.. దానికి పోటీగా విజ‌య్-సుధ సినిమాను కూడా రిలీజ్ చేస్తార‌ట‌. ఈ వార్త నిజ‌మే అయితే..ఒక‌ప్పుడు సుమ‌న్ శెట్టి హీరోగా ఆంధ్రా అంద‌గాడు అనే ఊరూ పేరూ లేని సినిమా తీసిన సుధ‌.. విజ‌య్‌తో సినిమా చేయ‌బోతుండ‌టం, దాన్ని రాజ‌మౌళి మూవీకి పోటీగా రిలీజ్ చేయ‌బోతుండ‌టం సెన్సేష‌న‌లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English