షారుఖ్.. ఏడాదిన్నర తర్వాత

షారుఖ్.. ఏడాదిన్నర తర్వాత

దశాబ్దం కిందట షారుఖ్ ఇండియన్ టాప్ స్టార్లలో ఒకడు. ఆయన అగ్ర స్థానానికి పోటీలో ఉండేవాడు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, ఆయన సినిమాలకు సంబంధించి లెక్కలు ఎక్కడో ఉండేవి. కానీ ఇప్పుడు ఇండియాలో టాప్-10 లిస్టులో కూడా షారుఖ్ లేడు. వరుస ఫ్లాపులతో మార్కెట్ బాగా పడిపోయి దయనీయ స్థితిలో ఉన్నాడు షారుఖ్.

ఖాన్ చివరి సినిమా ‘జీరో’ ఆయన్ని నిజంగానే జీరోను చేసేసింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో సినిమాల ఎంపికలో పునరాలోచనలో పడిపోయిన షారుఖ్.. ఏడాదికి పైగా విరామం తీసుకున్నాడు. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఆయన కొత్త సినిమా మొదలు కాలేదు. ఎవరితో సినిమా చేసేది కూడా ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం షారుఖ్ తన తర్వాతి సినిమాను ఖరారు చేశాడట. ఏడాదిన్న విరామం తర్వాత, అంటే ఈ వేసవిలో షారుఖ్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటాడట.

వరుసబెట్టి నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలోనే షారుఖ్ తన తర్వాతి సినిమా చేయబోతున్నాడట. వీళ్ల కాంబినేషన్ గురించి కొన్ని నెలలుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. తాజాగా అట్లీ స్క్రిప్టుకు షారుఖ్ ఆమోద ముద్ర వేశాడని.. ఈ చిత్రాన్ని ఆయన సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు కరణ్ జోహార్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తాయని సమాచారం.

తమిళ స్టార్ విజయ్ ఇందులో క్యామియో చేస్తాడని కూడా వార్తలొస్తున్నాయి. అట్లీ ‘బిగిల్’ తర్వాత మరే స్టార్ హీరోతోనూ సంప్రదింపులు జరపని నేపథ్యంలో షారుఖ్‌త సినిమా నిజమే కావచ్చు. ఈ సినిమా పూర్తయ్యాక షారుఖ్.. రాజ్ కుమార్ హిరానితో సినిమా చేస్తాడని అంటున్నారు. ఆ తర్వాత తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకేలతో ఓ సినిమాను షారుఖ్ లైన్లో పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ముందు అట్లీ.. షారుఖ్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా లేదా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English