అల వైకుంఠపురములో వేస్టేజ్ లో అది కూడా ఒకటి!

అల వైకుంఠపురములో వేస్టేజ్ లో అది కూడా ఒకటి!

అల వైకుంఠపురములో చిత్రం భారీ విజయం సాధించి నిర్మాతలకి బాగా లాభాలు తెచ్చిపెట్టింది కానీ దీనికి అయినా ఖర్చు అయితే భారీగానే ఉందట. సినిమాలోంచి తీసేసిన భాగంపై కోట్ల ఖర్చు దండగ అయిందట. అలాగే పబ్లిసిటీ పేరుతో ఎన్నో కోట్లు హారతి కర్పూరం అయిపోయాయట.

సినిమా హిట్ అయింది కనుక అవేమి కనిపించడం లేదు కానీ ఫెయిల్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదట. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ముందుగా ఈ కథ అనుకోలేదు. హిందీ సినిమా సోను కి టిటు కె స్వీటీ రీమేక్ హక్కులు తీసుకున్నారు. అయితే అది వద్దని మల్లి త్రివిక్రమ్ రూట్ లోకి వెళ్లి ఫామిలీ సినిమా చేసారు. అలా అనుకోకుండా అల  వైకుంఠపురములో రూపొంది అంత పెద్ద విజయం సాధించింది. ఆ హిందీ సినిమా హక్కుల కోసం కోటి రూపాయలు పైగానే చెల్లించిన నిర్మాతకి ఆ చిత్రాన్ని చేయడానికి హీరోలు దొరకడం లేదు.

రీమేక్ సినిమాలు ఫెయిల్ అవుతున్న రోజులు కావడంతో యువ హీరోలు కూడా దీనిపై ఆసక్తిగా లేరు. దాంతో ఆ చిత్రం హక్కుల కోసం పెట్టిన డబ్బులపై ఆశలు వదిలేసుకున్నారు. ఇది మాత్రమే కాదు హిందీ రీమేక్ హక్కులు తీసుకున్న పలు చిత్రాల పనులు ముందుకు సాగడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English