చిరంజీవిని ఏమి అనలేక, చరణ్ తో గొడవ ఇష్టం లేక!

చిరంజీవిని ఏమి అనలేక, చరణ్ తో గొడవ ఇష్టం లేక!

ఇప్పుడున్న యువ హీరోల్లో తారాపథంలో ఉన్న ఏ హీరో అయినా కానీ కొరటాల శివతో సినిమా అంటే ఎగిరి గంతేస్తాడు. అంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న కొరటాల శివ గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాడు. చిరంజీవితో ఠాగూర్ లాంటి చిత్రం చేద్దామని కొరటాల మెగా క్యాంపులో అడుగు పెట్టాడు. అయితే అప్పటికి చిరంజీవి సైరాతో బిజీగా ఉన్నారు. చిరంజీవి త్వరలోనే తన పని పూర్తి చేస్తారంటూ ఎదురు చూపులతోనే రెండేళ్లు గడిచిపోయాయి. ఇటీవలే షూటింగ్ మొదలైంది.

అయితే ఈ చిత్రంలో ఒక ముప్ఫై నిమిషాల పాటు కనిపించే ఒక పాత్రకి రామ్ చరణ్ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యారు. కానీ ఆర్ ఆర్ ఆర్ డిలే అవడంతో చరణ్ నటించే చిత్రం ఏదీ ముందు విడుదల కాకూడదనే క్లాజ్ ఉండడంతో ఈ చిత్రంలో చరణ్ చేస్తే కనుక రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూడక తప్పదు. అలా ఈ ఏడాదిలో వస్తుందనుకున్న చిత్రం వచ్చే వేసవికి వెళ్ళింది. చరణ్ పాత్ర ఎవరితో అయినా చేయిస్తే తప్ప ఈ చిత్రం ఈ ఏడాదిలో రాదు.

కెరీర్ పీక్ లో ఉండగా తన లాంటి స్టార్ డైరెక్టర్ సమయం వృధా చేసినందుకు వేరే వాళ్ళతో అయితే పెద్ద రచ్చే జరిగేది. కానీ మెగా స్టార్, ఆయన తనయుడు కావడంతో కొరటాల శివ ఏమీ అనలేక మౌనంగా ఉన్నాడు. అతని సమయాన్ని వృధా చేసినందుకు గాను మెగా హీరోలు ఏ విధంగా నష్ట పరిహారం చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English